వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా.. ప్రత్యేక హెలికాప్టర్‌లో బెంగళూరుకు...

ఫ్రతీకాత్మక చిత్రం

ఆయనకు 2 రోజుల క్రితం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఐతే బెంగళూరులో దొరబాబు సమీప బంధువుల ఆస్పత్రి ఉండటంతో దొరబాబును అక్కడికి తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బీభత్సం కొనసాగుతోంది. సామాన్య ప్రజలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా కరోనా బారినపడ్డారు. ఇటీవల కరోనా బారినపడిన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబును ప్రత్యేక హెలికాప్టర్‌లో బెంగళూరు తరలించారు. ఆయనకు 2 రోజుల క్రితం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఐతే బెంగళూరులో దొరబాబు సమీప బంధువుల ఆస్పత్రి ఉండటంతో ఆయన్ను అక్కడికి తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దొరబాబు వెంట ఆయన భార్యతో పాటు మరో ఇద్దరు బంధువులు బెంగళూరుకు వెళ్లారు.

  రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, డిప్యూటీ అంజాద్ బాషా, మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్‌తో పాటు ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, పెండెం దొరబాబు, కరణం బలరాం, బియ్యపు మధుసుధన్ రెడ్డి, ఎన్. వెంకటయ్య గౌడ్, ముస్తఫా, అన్నాబత్తుల శివకుమార్, కిలారి రోశయ్య, హఫీజ్ ఖాన్, గంగుల బిజేంద్ర రెడ్డి, అన్నా రాంబాబు, రాచమల్లు శివప్రసాద్, డాక్టర్ సుధాకర్, గొల్ల బాబూరావు, కే. శ్రీనివాసరావు, విశ్వసరాయి కళావతి కరోనా బారినపడ్డారు. వీరిలో పలువురు ఇప్పటికే కోలుకున్నారు.

  ఏపీలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,98,125కి చేరింది. కరోనాను జయించి వీరిలో 3,94,019 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఏపీలో మొత్తం99,689యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 4,417 మంది మరణించారు. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ఆ ఒక్క జిల్లాలోనే 66,948 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇక కరోనా టెస్టుల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో 72,573 కరోనా శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు 41,07,890మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.
  Published by:Shiva Kumar Addula
  First published: