ఎంపీ రఘురామపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వైసీపీ ఎమ్మెల్యే

తన సహచర ఎమ్మెల్యేలను అసభ్య పదజాలంతో కించపరిచారని.. పార్టీలో వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

news18-telugu
Updated: July 9, 2020, 12:48 PM IST
ఎంపీ రఘురామపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వైసీపీ ఎమ్మెల్యే
రఘురామకృష్ణంరాజు
  • Share this:
వైసీపీలో నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారంపై రచ్చ కొనసాగుతోంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని, ఆయనపై అనర్హత వేటువేయాలని.. ఇప్పటికే వైసీీపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేయగా.. తాజాగా ఆయనపై అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ భీమవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సహచర ఎమ్మెల్యేలను అసభ్య పదజాలంతో కించపరిచారని.. పార్టీలో వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

కాగా, ఏపీ ప్రభుత్వ పథకాలపై ఎంపీ రఘురామ రాజు అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న జగనన్న ఇళ్ల పథకంలో స్థలాల కేటాయింపులో అక్రమాలు జరుగుతున్నాయని, కొనుగోళ్లలో కూడా గోల్‌మాల్‌ జరుగుతోందని గతంలో ఆయన వ్యాఖ్యానించారు. దాంతో రఘురామ తీరుపై వైసీపీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమయింది. ఐతే వైసీపీ నేతలు బతికిలాడడం వల్లే తాను వైైసీపీలో చేరానని, తన వల్లే వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారని రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.

రఘురామ కృష్ణంరాజు చేసిన ఈ వ్యాఖ్యలతో మరింత దుమారం రేగిన విషయం తెలిసిందే. దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలని తూర్పు గోదావరికి చెందిన నేతలు ఆయనకు సవాల్ విసిరారు. అంతేకాదు సీఎం జగన్‌ను కలిసి రఘురామపై ఫిర్యాదు చేశారు. అనంతరం వైసీపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. స్వపక్షంలోనే విపక్షంగా ఉన్నారని.. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని పేర్కొన్నారు. అందుకే ఆయనపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు.
Published by: Shiva Kumar Addula
First published: July 9, 2020, 12:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading