హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఏపీలోకి నో ఎంట్రీ... పోలీసులతో వైసీపీ ఎమ్మెల్యే వాగ్వాదం

ఏపీలోకి నో ఎంట్రీ... పోలీసులతో వైసీపీ ఎమ్మెల్యే వాగ్వాదం

బార్డర్‌లో ఎమ్మెల్యేకు సంబంధించిన వాహనం

బార్డర్‌లో ఎమ్మెల్యేకు సంబంధించిన వాహనం

బెంగళూరు నుంచి ఐదు కార్లలో ఏపీ సరిహద్దుల్లోకి చేరుకున్న వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్... తమను రాష్ట్రంలోకి అనుమతించాలని పోలీసులను కోరారు.

  ఏపీ, కర్ణాటక సరిహద్దుల్లో కనిగిరి ఎమ్మెల్యే బొర్రా మధుసూదన్ హల్‌చల్ చేశారు. బెంగళూరు నుంచి ఐదు కార్లలో ఏపీ సరిహద్దుల్లోకి చేరుకున్న వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్... తమను రాష్ట్రంలోకి అనుమతించాలని పోలీసులను కోరారు. ఆయనతో పాటు ఆయనకు సంబంధించిన వాహనాల్లో 39 మంది బంధువులు కూడా ఉన్నారు. అయితే వీరిని చీకలబైలు చెక్‌పోస్ట్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఎవరినీ రాష్ట్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. దీంతో పోలీసులతో ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే వాహనం తిరుపతి చేరుకున్నట్టు సమాచారం.అయితే ఇప్పటికీ చెక్ పోస్ట్ దగ్గరే ఉన్న ఎమ్మెల్యే బంధువుల వాహనాలు ఉండిపోయాయి.

  రాష్ట్రంలోకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్లు కచ్చితంగా కొన్ని రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సిందే అని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా స్పష్టం చేశారు. ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతుండటంతో... లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని సర్కార్ నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే సరిహద్దుల దగ్గర నిబంధనలను పోలీసులు మరింత కఠినం చేశారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Coronavirus, Ysrcp

  ఉత్తమ కథలు