బాలకృష్ణకు ఓకే చెప్పిన రోజా... విజయవాడలో భేటీ...

కరోనా పరిస్థితులు చక్కబడిన తరువాత దీనిపై చర్చించేందుకు విజయవాడ రావాలని రోజా చెప్పారని బాలకృష్ణ అన్నారు.

news18-telugu
Updated: June 6, 2020, 10:08 PM IST
బాలకృష్ణకు ఓకే చెప్పిన రోజా... విజయవాడలో భేటీ...
బాలకృష్ణ, రోజా(ఫైల్ ఫోటో)
  • Share this:
ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న నందమూరి బాలకృష్ణ... తన నియోజకవర్గమైన హిందూపురం అభివృద్ధి కోసం వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్ రోజా సాయం తీసుకోబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా బాలకృష్ణే తెలిపారు. హిందూపురం నియోజకవర్గాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేశానని... అయితే తన నియోజకవర్గాన్ని పారిశ్రామికంగానూ అభివృద్ధి చేయాలనే ఆలోచన తనకు ఉందని ఆయన వివరించారు. ఈ క్రమంలోనే ఏపీఐఐసీ చైర్మన్ రోజాతో మాట్లాడినట్టు బాలకృష్ణ తెలిపారు. ఈ విషయంలో రోజా కూడా సానుకూలంగానే స్పందించారని వ్యాఖ్యానించారు.

కరోనా పరిస్థితులు చక్కబడిన తరువాత దీనిపై చర్చించేందుకు విజయవాడ రావాలని రోజా చెప్పారని అన్నారు. అక్కడ అధికారులతో కలిసి ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ అంశంపై చర్చిద్దామని రోజా చెప్పినట్టు బాలకృష్ణ తెలిపారు. మరి... హిందూపురంలో పారిశ్రామిక అభివృద్ధి విషయంలో బాలకృష్ణకు రోజా ఏ మేరకు సహకారం అందిస్తారో చూడాలి.

First published: June 6, 2020, 10:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading