ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కరోనా వైరస్ (Corona Virus) విజృంభిస్తోంది. థర్డ్ వేవ్ (Corona Third Wave) లో కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు భారీగా పెరుగుతోంది. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే మూడోసారి కరోనా బారిన పడ్డారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కరోనా వైరస్ (Corona Virus) విజృంభిస్తోంది. థర్డ్ వేవ్ (Corona Third Wave) లో కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు భారీగా పెరుగుతోంది. ప్రజలు నిబంధనలు సరిగా పాటించకపోవడం, మాస్క్, భౌతిక దూరం పాటించకపోవడంతో వైరస్ వేగంగా విజృంభిస్తోంది. కొత్త ఏడాది రాష్ట్రంలో పాజిటివిటీ రేటు ఏకంగా 13శాతానికి చేరిపోయింది. కొంతకాలంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ప్రముఖులు కూడా వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కరోనా బారిన పట్టారు. జలుబు, ఒళ్లు నొప్పులుగా ఉండటం టెస్టు చేయించుకోగా పాజిటివ్ గా తేలినట్లు ఆయన వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారు టెస్టులు చేయించుకొని తగుజాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు అంబటి ప్రకటించారు.
భోగి పండుగ సందర్భంగా సత్తెనపల్లిలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. మాస్క్ ధరించకుండానే మహిళలతో కలిసి ఆయన సాంప్రదాయ నృత్యాలు వేశారు. ఈ కారణంగానే ఆయనకు కరోనా సోకిందన్న ప్రచారం జరిగింది. గతంలో అంబటి రాంబాబు రెంసార్లు కరోనా బారిన పడ్డారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా సోకడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇదిలా ఉంటే థర్డ్ వేవ్ లో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిథులు కరోనా బారిన పడ్డారు. ఇటీవల ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని (Kodali Nani), టూరిజం మంత్రి అవంతి శ్రీనివాసరావు (Avanti Srinivas) కు కరోనా పాజిటివ్ గా తేలింది. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణకు కరోనా సోకింది. దీంతో వారు హైదాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.
సంక్రాంతి సందర్భంగా ఏపీ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూని కూడా వాయిదా వేయడంతో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 13శాతానికి చేరింది. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే ప్రమాదముంది. ప్రభుత్వం నిబంధనలు పాటించాల్సిందేనని చెబుతున్నా.. ప్రజలు మాత్రం బేఖాతరు చేస్తున్నారు. దీంతో కరోనా కేసుల సంఖ్య రోజరోజికీ రెట్టింపువుతున్నాయి. ఇప్పటివరకు కరోనా సోకిన మంత్రులు ఎమ్మెల్యేలు వివిధ కార్యక్రమాల్లో నేరుగా వెళ్లి పాల్గడంతోనే కరోనా బారిన పట్టడ్లు స్పష్టమవుతోంది. దీంతో ప్రజలు బహిరం ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ప్రభుత్వం సూచిస్తోంది. శవివారం రాష్ట్రవ్యాప్తంగా 4,955 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా... రికవరీలు మాత్రం వందల్లోనే ఉన్నాయి.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.