Pawan Kalyan Vs Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం వేడెక్కింది. అధికార -విపక్షాల మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా విశాఖపట్నం (Visakhapatnam) స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఒకరోజు దీక్షను జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) విరమించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన పవన్.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) కోసం పోరాడాల్సింది వైసీపీనేని పవన్ మరోసారి స్పష్టం చేశారు. 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలున్న వైసీపీనే స్టీల్ ప్లాంట్ కోసం పోరాడాల్సిన అసవరం లేదా అన్నారు. ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తాను ఎలా అల్టిమేటం ఇవ్వగలనని ప్రశ్నించారు. వైసీపీ రౌడీయుజాన్ని, దౌర్జన్యాలను, బూతులను ఇంకా రెండున్నరేళ్లు భరించక తప్పదన్నారు. ప్రజలంతా వైసీపీకి ఓటు వేశారుగనుక స్టీల్ ప్లాంట్ అంశంపై వారినే నిలదీయాలని పవన్ పిలుపునిచ్చారు.
పవన్ కళ్యాణ్ వాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు (Amabati Rambabu) ఫైర్ అయ్యారు. అమరావతి ఒకటే రాజధాని కావాలని అంటున్న.. పవన్ గతంలో చెప్పిన మాటలు మర్చిపోయారా అని అంబటి ప్రశ్నించారు. జనసేనను అధికారంలోకి తీసుకుని రావాలని అడిగే హక్కు ఉందా అని అడిగిన ఆయన విశాఖ ఉక్కుపై కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే ధైర్యం మీకు ఉందా అని నిలదీశారు. విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వ ఆస్తి. అయినా ఇలా అమ్మటం అన్యాయం అని అవకాశం ఉన్న ప్రతి సందర్భంలోనూ చెబుతూనే ఉన్నాం. మిత్రులను అడిగే ధైర్యం లేని వాళ్ళకు మమ్మల్ని విమర్శించే హక్కు ఎక్కడిది అన్నారు. ప్రజాస్వామ్య పద్దతిలో కేంద్రంపై వైసీపీ పోరాటం చేస్తోంది అన్నారు. డిమాండ్ల సాధన కోసం తాము సాయుధ పోరాటం చేయాలా… తుపాకులు పట్టుకు తిరగాలా అన్నారు.
ఇదీ చదవండి :“వియ్యంకుడు అఖండ.. కుమారుడు పప్పుండ..” చంద్రబాబుపై మంత్రి ఘాటు వ్యాఖ్యలు
పవన్ కు నిజంగా దమ్ముంటే, చిత్తశుద్ది ఉంటే ప్లకార్డు పట్టుకుని బీజేపీ కార్యాలయం ముందు నిలబడాలి. కనీసం ప్లకార్డు పట్టుకోలేని ఆయన రాజకీయ నాయకుడా అని నిలదీశారు. పవన్ గత ఎన్నికల్లో రెండు చోట్ల ఒడారు..ఈసారి మూడు చోట్ల పోటీ చేయాలని సూచించారు. పవన్ ఏమైనా చెగువీరా వారసుడా..తుపాకి గొట్టం ద్వారా రాజ్యం తీసుకువస్తారా.. మాట్లాడే సమస్యలపై పూర్తి స్పష్టత తీసుకుని పవన్ మాట్లాడాలి. నాలుగు రోజులు రాజకీయాలు.. ఏడాది పాటు సినిమాలు చేయడమే పవన్ పని. ఆయన ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో ఎవరికీ తెలియదు అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: మాఎంపీలు రాజీనామా చేస్తారు.. మీరు సిద్ధమా..? వైసీపీ ప్రభుత్వానికి చంద్రబాబు సవాల్
ప్రత్యేక హోదాను వెయ్యి అడుగుల గొయ్యి తీసి పాతి పెట్టిన చంద్రబాబుకు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటికరిస్తున్న బీజేపీకీ సపోర్ట్ గా ఉన్న పవన్.. ఏది ఇచ్చినా ఆవు కథ వ్యాసం రాసే వారిలా ఉంది ఆయన వైఖరిపై అంబటి ఫైర్ అయ్యారు. విశాఖ ఉక్కు గురించి దీక్ష చేస్తున్న అన్న పవన్ కళ్యాణ్ ఉపన్యాసం లో ఎక్కడా విశాఖ ఉక్కు ప్రస్తావనే లేదు. ఉపన్యాసం అంతా జగన్ కు 151 మొత్తం. వారసత్వ రాజకీయాలను ఎదుర్కొన్నాడు కనుకే మోడీ అంటే నాకు ఇష్టం అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ వచ్చింది ఎక్కడ నుంచి అని ప్రశ్నించారు. రాజకీయాల్లోనే వారసత్వాలకు వ్యతిరేకమా… సినిమాల్లో వారసత్వాలకు వ్యతిరేకం కాదా అని అన్నారు. అసలు సినిమాల్లో పవన్ కళ్యాణ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు? లెక్కల్లో చెబుతున్నది ఎంత అని అడిగారు. కేంద్ర ప్రభుత్వం అప్పు 121 కోట్ల లక్షలు. మరి దేశాన్ని అమెరికాకు అమ్మేయాలంటారా అన్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ambati rambabu, Andhra Pradesh, AP News, Pawan kalyan, Vizag Steel Plant, Ysrcp