పెళ్లి వేదిక కూలి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ప్రమాదం

తాడేపల్లి ఉండవల్లి గ్రామంలో ఒక వివాహానికి హాజరు అయిన సందర్భంగా వేదికపై వధూవరులను ఆశీర్వదించే సమయంలో వేదిక కూలిపోయింది.

news18-telugu
Updated: February 28, 2020, 9:28 PM IST
పెళ్లి వేదిక కూలి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ప్రమాదం
గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి
  • Share this:
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రమాదానికి గురయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లి ఉండవల్లి గ్రామంలో ఒక వివాహానికి హాజరు అయిన సందర్భంగా వేదికపై వధూవరులను ఆశీర్వదించే సమయంలో వేదిక కూలిపోయింది. ఆ సమయంలో ఆర్కే కిందపడ్డారు. దీంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి కుడికాలి పాదానికి గాయమైంది. వెంటనే ఆయన్ను చికిత్స కోసం గుంటూరు ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అక్కడ చికిత్స అందించారు.

మూడు రాజధానులు చేస్తామంటూ సీఎం జగన్ ప్రకటించిన తర్వాత మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డికి సంకట పరిస్థితి ఏర్పడింది. అయితే, తాను జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. తాజాగా, అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే చంద్రబాబు, టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. అమరావతి ప్రాంతంలో మొత్తం 54 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తుంటే చంద్రబాబు బాధేంటని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్ నిర్ణయంతో అమరావతి ఇకపై బహుజన అమరావతిగా, సర్వజన అమరావతిగా మారనుందని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. అరలక్షకు పైగా కుటుంబాలకు రెండు లక్షల ప్రజలకు అమరావతి కొత్తగా ఆశ్రయం కల్పించనుందని అన్నారు. అమరావతిలో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీలు, ఇతర కులాల్లో నిరుపేదలకు సంబంధించి 54 వేల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించనున్నామని అన్నారు.

First published: February 28, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు