గుంటూరు ఎంపీ సీటుపై న్యాయ పోరాటం చేస్తాం : విజయసాయి రెడ్డి

Vijay Sai Reddy : గుంటూరు ఎంపీ సీటు ఫలితంపై వివాదం నడుస్తోంది. వైసీపీ న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: May 28, 2019, 1:17 PM IST
గుంటూరు ఎంపీ సీటుపై న్యాయ పోరాటం చేస్తాం : విజయసాయి రెడ్డి
విజయసాయిరెడ్డి (File)
  • Share this:
గుంటూరులో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఎన్నిక చెల్లదంటూ వాదిస్తున్నాయి. దీనిపై కోర్టులో కేసు వేయాలని వైసీపీ నిర్ణయించింది. హోరా హోరీగా జరిగిన తాజా ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి మోదుగుల వేణుగోపాలరెడ్డిపై గల్లా జయదేవ్ 4,200 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే ఓట్ల లెక్కింపు సందర్భంగా గల్లా అండ్ కో... రిటర్నింగ్ అధికారి అయిన జిల్లా కలెక్టర్‌ను మ్యానేజ్ చేశారని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అక్కడి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో 9 వేల బ్యాలెట్లను రిటర్నింగ్ అధికారి హోదాలో కలెక్టర్ రెజెక్ట్ చేశారు. ఆ 9 వేల పోస్టల్ బ్యాలెట్ల కవర్లపై సీరియల్ నెంబర్లు లేవన్నది రిటర్నింగ్ అధికారి వాదన. అందుకే వాటిని రిజెక్ట్ చేశామని ఆయన చెప్పారు. ఐతే... గుంటూరు ఎంపీ స్థానంలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో రిటర్నింగ్ అధికారి పక్షపాతం ప్రదర్శించారని ఆరోపించారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. స్వల్ప సాంకేతిక కారణం చూపి 9,700 ఓట్లను లెక్కించలేదని ఆయన అన్నారు. ఆర్వో అక్రమానికి పాల్పడటం వల్ల టీడీపీ 4,200 ఓట్లతో గెలిచారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని ట్విట్టర్ ద్వారా ఆయన ప్రకటించారు.

ఈ విషయంలో కౌంటింగ్ రోజే... మోదుగుల, మంగళగిరి అభ్యర్థి ఆళ్ల... రిటర్నింగ్ అధికారి మధ్య వాగ్వాదం జరిగింది. కవర్లపై నెంబర్లు లేనంత మాత్రాన రిజెక్ట్ చేయాల్సిన అవసరం లేదన్నది మోదుగుల వాదన. గల్లా మాత్రం వాటిని రిజెక్ట్ చెయ్యాల్సిందేనని పట్టుబట్టారు. చివరకు అదే జరిగింది. ఈ వివాదంపై కోర్టుకెక్కేందుకు సిద్ధమవుతున్నారు మోదుగుల. ఇదే విధంగా సీరియల్ నెంబర్లు లేకుండా వచ్చిన పోస్టల్ బ్యాలెట్లను నరసారావుపేట, ఒంగోలుతో పాటు కృష్ణా జిల్లాలో చాలా చోట్ల లెక్కించారని ఆయన అంటున్నారు. గుంటూరు జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో ఇలాంటి పోస్టల్ బ్యాలెట్లను లెక్కించినప్పుడు... గుంటూరు పార్లమెంట్ పరిధిలో లెక్కిస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. రిజెక్టయిన పోస్టల్ బ్యాలెట్లను లెక్కించేలా కోర్టుకెళ్ళి ఆర్డర్ తెచ్చుకుంటామంటున్నారు మోదుగుల.

 ఇవి కూడా చదవండి :

మండుతున్న ఎండలకు పుచ్చకాయే కరెక్ట్... రోజూ తినాలంటున్న డాక్టర్లు...

ఒక్క తులసి మొక్కను పెంచినా చాలు... ఆరోగ్యమే ఆరోగ్యం

ఎండు ఖర్జూరాలను తేనెలో నానబెట్టి తింటే.... ప్రయోజనాలు ఇవీ...

సెక్స్ సామర్ధ్యాన్ని పెంచే ప్రకృతి ఔషధం..గొంగళి పురుగు నుంచీ పుట్టే మొక్క
First published: May 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>