Home /News /andhra-pradesh /

YSRCP LEADER SAJJALA RAMAKRISHNA REDDY COMMENTS ON UNANIMOUS ELECTION IN AP PANCHAYAT ELECTIONS AK

Andhra Pradesh: వందశాతం ఏకగ్రీవాలకు ప్రయత్నం.. వైసీపీ ముఖ్యనేత సజ్జల కీలక వ్యాఖ్యలు

సజ్జల రామకృష్ణారెడ్డి (ఫైల్ ఫోటో)

సజ్జల రామకృష్ణారెడ్డి (ఫైల్ ఫోటో)

Sajjala Ramakrishna Reddy: గత మార్చిలో ఏకగ్రీవాలు ఆమోదయోగ్యం అన్న ఎన్నికల కమిషనర్‌ ఇప్పుడు వచ్చేసరికి వాటిని ఓ చూపు చూడాల్సి వస్తుందని హెచ్చరించటం వింతగా ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

    ఎన్నికలు గ్రామ అభివృద్ధి, అభ్యుదయం, సంక్షేమం లక్ష్యంగా గ్రామ అవసరాలు తీర్చేలా సామరస్యంతో సుహృద్భావ వాతావరణంలో ఎన్నికలు జరగాలని వైసీపీ ముఖ్యనేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అందుకని ఏకగ్రీవాలు ఎక్కువ చేయాలని అభిప్రాయపడ్డారు. వైసీపీ వందశాతం ఏకగ్రీవాలు చేసే దిశగా అడుగులు వేస్తుందని... మిగిలిన పార్టీలకు, స్టేక్‌ హోల్డర్‌లకు కూడా తమ పార్టీ ఇదే విజ్ఞప్తి చేస్తోందని తెలిపారు. ఇప్పుడు జరగబోయే పంచాయితీ ఎన్నికలను వైసీపీకి చరిత్రాత్మకమైనవని అన్నారు. ఈ ఎన్నికలు ఎంత ప్రశాంతంగా జరిగితే తర్వాత జరిగే పథకాల అమలు సులభంగా ఎలాంటి గొడవలు లేకుండా శాంతియుతంగా జరిగే అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో వీలైనంత వరకు పట్టుదలకు పోకుండా పోటీ లేకుండా.. ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగే ప్రయత్నం చేయాలని అన్నారు. ఏ పార్టీ పట్టుదలకు పోకుండా, గ్రామంలోని పెద్దలు అంతా చర్చించి సామరస్యంగా ఏకగ్రీవ ఎన్నికలను ప్రోత్సహించాలని తెలిపారు. గతంలో 2013 ఎన్నికలప్పుడు కూడా ఏకగ్రీవాలను ప్రోత్సహించటం కోసం నగదు మొత్తాలను సవరించి ప్రోత్సాహకాన్ని పెంచారని ఆయన గుర్తు చేశారు.

    ఎన్నికలు అంటే వచ్చే ఖర్చు, పట్టుదలలు, గొడవలు, అన్నదమ్ములు కొట్టుకోవటాలు వంటివి భవిష్యత్తులో ఫ్యాక్షన్‌గా మారటం జరుగుతుంటాయని అన్నారు. సాధ్యమైనంత వరకు ఏకగ్రీవాలు చేసే ప్రయత్నాలు చేయమని ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని... అందుకనే ఈ ప్రోత్సాహకాలు కూడా మరింత పెంచి ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ఎవరి బలాలు ఏంటో.. పార్టీ గుర్తులపై జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెలుస్తుందని... పంచాయితీ ఎన్నికల దగ్గర మనం పట్టుదలకు పోతే గ్రామాల్లో వాతావరణం చెడిపోతుందని అభిప్రాయపడ్డారు.

    గత మార్చిలో ఏకగ్రీవాలు ఆమోదయోగ్యం అన్న ఎన్నికల కమిషనర్‌ ఇప్పుడు వచ్చేసరికి వాటిని ఓ చూపు చూడాల్సి వస్తుందని హెచ్చరించటం వింతగా ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎస్‌ఈసీ ఉద్దేశాల వెనుక ప్రతిపక్ష తెలుగుదేశం ఉందని అనుమానంగా ఉందని అన్నారు. ఏదో ఒకరకంగా చిచ్చు పెట్టాలని డబ్బు, మద్యం దింపి.. ఈ ఎన్నికల్లో పనికిమాలిన నీతిమాలిన వ్యవహారాలకు దిగాలని చూస్తే చట్టంలో చేసిన సవరణ అమలు జరిగి తీరుతుంది. ఎన్నిక అయిన తర్వాత కూడా డిస్‌క్వాలిఫై అవుతారని, జైలు శిక్షలు తప్పవనే విషయం గుర్తుంచుకోవాలి. ఏ పార్టీ వారైనా ఈ విషయం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Gram Panchayat Elections, Sajjala ramakrishna reddy, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు