బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా కొనసాగుతున్న కౌన్ బనేగా కరోడ్‌పతి షోకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ షో పాల్గొని సామాన్యుల నుంచి మిలియనీర్లుగా మారిన వారు చాలా మందే ఉన్నారు. ఈ షోలో రాజకీయాలు, సినిమాలు, స్పోర్ట్స్, జనరల్ నాలెడ్జ్.. ఇలా చాలా రకాల ప్రశ్నలను అమితాబ్ హాట్ సీట్‌లో కుర్చొన్న కంటెస్టెంట్‌లను అడుగుతుంటాడు. సామాన్యలు నుంచి సెలబ్రిటీల వరకు ఈ హాట్ సీట్‌లో కూర్చొవడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. అయితే ఇటీవల ప్రారంభమైన కేబీసీ 12వ సీజన్‌లో యూపీలోని బలియాకు చెందిన సోనూ కుమార్ గుప్తా అనే ప్రైవేట్ ఉద్యోగి పాల్గొన్నాడు. అప్పటికే 12 ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన అతను 12.5 లక్షల రూపాయలు గెలుచుకున్నాడు.
ఆ తర్వాత సోనూ కుమార్‌ను బిగ్‌బీ.. 13వ ప్రశ్నగా 2019లో పి సుభాష్ చంద్రబోస్ అనే రాజకీయ నాయకుడు ఏ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా పనిచేశారు? అని అడిగారు. దీనికి సమాధానం చెబితే అతని ఖాతాలో రూ. 25 లక్షలు చేరుతాయి. అయితే అప్పటికే తనకున్న లైఫ్ లైన్లు అన్ని ఉపయోగించుకోవడం, ఆ ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో.. అతడు రూ. 12.5 లక్షలు తీసుకుని షో నుంచి క్విట్ అవుతున్నట్టు తెలిపాడు.
తను క్విట్ అయినట్టు తెలిపిన అనంతరం.. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏదని భావిస్తున్నారు అని అడగ్గా.. దానికి సోనూ కుమార్ ఆంధ్రప్రదేశ్ అని గెస్ చేశాడు. అయితే అది సరైనా సమాధానమే అయినప్పటికీ.. షో నుంచి క్విట్ కావడంతో.. అమితాబ్ అతనికి రూ. 12.5 లక్షల రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా అమితాబ్ ఆ ప్రశ్నకు సమాధానం గురించి వివరించాడు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. సీఎం జగన్ కొత్త కేబినెట్‌లో ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల్ని నియమించారని.. అందులో ఒక్కరే పి.సుభాష్ చంద్రబోస్ అని తెలిపారు. ఇక, ఇటీవలే తన డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్.. రాజ్యసభలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pilli Subhash Chandra Bose, Ysrcp