డేటా చౌర్యం రాజద్రోహమే...చంద్రబాబుపై కేసుపెట్టాలి: పార్థసారధి

ప్రజలకు చేసిన పనుల ద్వారా ఓట్లు అడగాలని..అంతేగానీ ఓట్ల తొలగింపుతో అధికారంలోకి రావాలనుకోవడం దిగజారుడుతనమని పార్థసారధి ధ్వజమెత్తారు. చంద్రబాబుకు దమ్ముంటే ప్రజాస్వామ్యబద్ధంగా జగన్‌ను ఎదుర్కోవాలని సవాల్ విసిరారు.

news18-telugu
Updated: March 4, 2019, 4:53 PM IST
డేటా చౌర్యం రాజద్రోహమే...చంద్రబాబుపై కేసుపెట్టాలి: పార్థసారధి
పార్థసారధి
  • Share this:
ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఐటీ గ్రిడ్ సంస్థకు అప్పగించినందుకు చంద్రబాబుపై రాజద్రోహం కేసుపెట్టాలని వైసీపీ నేత పార్థసారధి డిమాండ్ చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని చంద్రబాబు, లోకేశ్ కుట్రల కోసం వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రజల అకౌంట్ల నుంచి డబ్బులు దొంగిలించినా ఏమీ చేయలేని దుస్థితి ఏపీలో నెలకొందని విమర్శించారు. గుమ్మడి కాయల దొంగలా చంద్రబాబు భుజాలు తడుముకుంటున్నారని విరుచుకుపడ్డారు పార్థసారధి. వైసీపీ అన్ని ఆధారాలతో సహా ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేసిందని..వాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు అపహస్యం చేస్తున్నారు. డేటా చౌర్యం రాజద్రోహం కిందకే వస్తుంది.రాజద్రోహం కింద చంద్రబాబుపై ఎందుకు కేసు పెట్టకూడదు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే చంద్రబాబు భుజాలు ఎందుకు తడుముకుంటున్నారు. విచారణకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు. ఐటి పరిజ్ఞానాన్ని లోకేష్ ,చంద్రబాబులు కుట్రల కోసం వాడుకుంటున్నారు.ఐటి శాఖను కొడుకు చేతిలో పెట్టి ఓటర్ల లిస్ట్‌లో మాయ చేస్తున్నారు. తన 40 ఏళ్ల అనుభవాన్ని ప్రజలకు మేలు చేయడానికి కాకుండా దుర్వినియోగం చేస్తున్నారు. టీడీపీ వ్యక్తులు తమ ప్రత్యర్థుల ఓట్లను తొలగిస్తున్నారు. ఐటి రైడ్స్ చేస్తే చంద్రబాబుకు ఎందుకు భయం. ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తామంటే నీకేం భయం. ఇప్పుడు ఐటిగ్రిడ్స్ సంస్దపై ఫిర్యాదు ఇస్తే నీకేం భయం.
పార్థసారధి, వైసీపీ నేత


వెన్నుపోటు పార్టీ ప్రజలను వెన్నుపోటు పొడవడం తప్ప...రాష్ట్రానికి ఏమీ చేయలేదని విమర్శించారు పార్థసారధి. గతంలో పవన్‌ను టార్గెట్ చేసిన చంద్రబాబు...ఇప్పుడు మోదీ, కేసీఆర్, జగన్‌ను తిడుతున్నారని మండిపడ్డారు. పవన్, చంద్రబాబు మధ్య ఏమైనా ఒప్పందం కుదిరిందా అని ప్రశ్నించారు. ప్రజలకు చేసిన పనుల ద్వారా ఓట్లు అడగాలని..అంతేగానీ ఓట్ల తొలగింపుతో అధికారంలోకి రావాలనుకోవడం దిగజారుడుతనమని పార్థసారధి ధ్వజమెత్తారు. చంద్రబాబుకు దమ్ముంటే ప్రజాస్వామ్యబద్ధంగా జగన్‌ను ఎదుర్కోవాలని సవాల్ విసిరారు.

ఇవి కూడా చదవండి:

ఏపీ ప్రజల డేటా చౌర్యం కేసులో ఎంత పెద్దలున్నా వదలిపెట్టేది లేదు: తెలంగాణ పోలీసులు

మూలాలు కదలిపోతాయ్..ఖబడ్దార్...కేసీఆర్, జగన్‌కు చంద్రబాబు వార్నింగ్

టీడీపీ, వైసీపీ మధ్య డేటా యుద్ధం... ఫామ్ 7 అంటే ఏంటి?
First published: March 4, 2019, 4:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading