శాసనమండలి రద్దు దిశగా వైసీపీ యోచన...టీడీపీకి షాక్ ఇచ్చేందుకు రంగం సిద్ధం...

రేపు కూడా అలాగే వ్యవహరిస్తే మండలి రద్దుపై అసెంబ్లీ లో తీర్మానం చేసి పార్లమెంట్ కి పంపాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. దీనిపై న్యాయనిపుణులతో సైతం ప్రభుత్వం చర్చిస్తోంది. ఇదిలా ఉంటే మండలిలో ప్రవేశపెట్టే బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేసి ప్రభుత్వానికి షాక్ ఇవ్వాలని టీడీపీ భావిస్తోంది.

news18-telugu
Updated: January 19, 2020, 11:34 PM IST
శాసనమండలి రద్దు దిశగా వైసీపీ యోచన...టీడీపీకి షాక్ ఇచ్చేందుకు రంగం సిద్ధం...
సీఎం జగన్
  • Share this:
మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ రద్దు వ్యవహారాల్లో శాసనమండలిలో ఇబ్బందులు తలెత్తితే సీరియస్ గా తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా శాసనమండలిని రద్దు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన సైతం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లీష్ మీడియం వ్యవహారంలోను ప్రభుత్వాన్ని అర్థం చేసుకోకుండా ప్రతిపక్షం రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చిందన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రేపు కూడా అలాగే వ్యవహరిస్తే మండలి రద్దుపై అసెంబ్లీ లో తీర్మానం చేసి పార్లమెంట్ కి పంపాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. దీనిపై న్యాయనిపుణులతో సైతం ప్రభుత్వం చర్చిస్తోంది. ఇదిలా ఉంటే మండలిలో ప్రవేశపెట్టే బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేసి ప్రభుత్వానికి షాక్ ఇవ్వాలని టీడీపీ భావిస్తోంది.

అసెంబ్లీ సమావేశాలు జరగకుండా ఉండేందుకు ఈనెల 20న ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని టీడీపీ కార్యకర్తలను సమాయత్తం చేస్తోంది. మరోవైపు మండలి లో రాజధాని తరలింపు బిల్లును టీడీపీ అడ్డుకుంటుందని భావిస్తున్న వైసీపీ.. ఈ నేపథ్యంలోనే మండలిని రద్దు చెయ్యాలన్న వ్యూహాన్ని రచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

First published: January 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు