YSRCP GOVT ISSUED RESTRICTIONS OVER LIQUOR BOTTLES MS
మూడుకి మించవద్దు.. మద్యపాన నిషేధం దిశగా జగన్ సర్కార్ మరో కీలక అడుగు
ప్రతీకాత్మక చిత్రం
AP Liquor Policy : రాష్ట్రంలో వ్యక్తిగత మద్యం నిల్వలపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది.ఒక్కో వ్యక్తి వద్ద 3 కంటే ఎక్కువ మద్యం బాటిల్స్ ఉండరాదని ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికల హామీల్లో భాగంగా మద్యం నిషేధం దిశగా ఏపీ సర్కార్ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించేసిన ప్రభుత్వం.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఇప్పటినుంచి రాష్ట్రంలో వ్యక్తిగత మద్యం నిల్వలపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది.ఒక్కో వ్యక్తి వద్ద లిక్కర్ బాటిల్స్ అయితే 3, బీర్ బాటిల్స్ అయితే 6 కంటే మించి ఉండవద్దని ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.
కాగా, నూతన మద్యం పాలసీ విధానాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ కింద సెప్టెంబర్ 1వ తేదీ నుంచి దాన్ని అమలుచేస్తోంది. దీని ప్రకారం ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహిస్తోంది. ప్రతి మద్యం షాపు దగ్గర ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్‌ను నియమించనుంది. పర్మిట్ రూమ్స్‌ను పూర్తిగా రద్దుచేసింది. ఎమ్మార్పీ రేట్లకే మద్యం,రాత్రి 9గంటల వరకే మద్యం విక్రయాలు వంటి నిబంధనలు తీసుకొచ్చింది. వచ్చే ఎన్నికల నాటికి సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలుచేయాలన్న లక్ష్యంతో జగన్ సర్కార్ ఆ దిశగా అడుగులు వేస్తోంది.
Published by:Srinivas Mittapalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.