Home /News /andhra-pradesh /

Target Kuppam: కుప్పంలో ఇక డైరక్ట్ అటాక్.. చంద్రబాబుపై పోటీకి బరిలో యువనేత

Target Kuppam: కుప్పంలో ఇక డైరక్ట్ అటాక్.. చంద్రబాబుపై పోటీకి బరిలో యువనేత

కుప్పంపై వైసీపీ ఫోకస్

కుప్పంపై వైసీపీ ఫోకస్

Target Kuppam: కుప్పంలో ఓటమిపై చంద్రబాబు అలర్ట్ అయ్యారు. మళ్లీ అలాంటి పరిస్థితి రాకూడదని ప్రక్షాళన మొదలెడతామన్నారు.. పార్టీలో కోవర్లును ఏరి పారేస్తాను అన్నారు. కుప్పంపై ప్రత్యేక వ్యూహం సిద్ధం చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో అధికార పార్టీ సైతం చంద్రబాబు ఎత్తులను చిత్తు చేస్తూ.. 2024 టార్గెట్ గా కుప్పంపై ఫోకస్ చేస్తోంది. నేరుగా చంద్రబాబుపై ఓ యువనేతను బరిలో దించే ఆలోచనలో ఉంది వైసీపీ..

ఇంకా చదవండి ...
  Target Kuppam:  తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సొంత నియోజకవర్గం కుప్పం (kuppam)పై అధికార వైసీపీ ఫోకస్ చేసింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు చంద్రబాబుకు కుప్పం కంచుకోటగా ఉంటూ వచ్చింది. ఆయన కుప్పంలో అడుగు పెట్టకపోయినా గెలుపు నల్లేరుపై నడకే అయ్యేది. కానీ ఆ ఎన్నికల తరువాత నుంచి అధికార పార్టీ పూర్తి ఫోకస్ కుప్పంపై పెట్టింది. ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Minster Peddireddy Ramachandra Reddy) అక్కడే మకాం వేసి.. మొత్తం కుప్ప వ్యవహారాలు చూస్తున్నారు. చంద్రబాబుకు చెక్ చెప్పేందుకు అన్ని రకాల ఎత్తులు వేస్తున్నారు. చేతిలో అధికారం ఉండడం.. తెలుగు నేతల మధ్య తగాథాలు, మంత్రి పెద్ది రెడ్డి వ్యూహాలు కలిపి కుప్పంలో చంద్రబాబుకు డ్యామేజ్ తప్పలేదు. మొదట పంచాయతీలు.. ఆ తరువాత పరిషత్‌లు.. ఈ మధ్య మున్సిపాలిటీలు.. ఇలా అన్నీ వైసీపీ కైవసం అయ్యాయి. చంద్రబాబుకు కంచుకోటలాంటి కుప్పంలో 40 ఏళ్ల తరువాత మరో పార్టీ అడుగుపెట్టగలింది. ఆ దూకుడు కొనసాగిస్తూ.. 2024 నాటికి కుప్పంలో బాబు పీఠం కదల్చడమే టార్గెట్‌గా పెట్టుకుంది అధికార పార్టీ. అయితే ఫార్టీ ఇయర్స్‌ సీనియర్‌ను ఢీకొట్టడానికి ఓ యువనేతను బరిలో దించుతారనే టాక్‌ చిత్తూరు జిల్లా వైసీపీలో ఓ రేంజ్‌లో ఉంది. ఇంతకీ వైసీపీ వ్యూహం ఏంటి? ఎవరిని పోటీకి పెట్టబోతోంది?

  ఓ వైపు చంద్రబాబు ఎక్కడ పొరపాటు జరిగింది..? ఓటమికి కారణం ఎవరు..? టీడీపీ నేతలే సహకరించారా? వైసీపీ అధికార ప్రలోభాలకు పాల్పడిందా..? ఇలా అన్ని కోణాల్లో సమీక్షిస్తున్నారు. పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నారని గుర్తించిన కొందరపి వేటు వేసేందుకు కూడా చంద్రబాబు సిద్ధమైనట్టు తెలుస్తోంది. తాజాగా కుప్పం , ఇతర పార్టీ నేతలతో మంగళగిరిలో మాట్లాడిన ఆయన.. కుప్పం నుంచే ప్రక్షాళన మొదలవుతుంది అన్నారు. ఇదే సమయంలో.. పంచాయతీ ఎన్నికల నుంచి మున్సిపల్ ఎన్నికల వరకు టీడీపీ కంచుకోటలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డైరెక్షన్‌లో వైసీపీ జెండా ఎగరేశారు. అక్కడితో సరిపెట్టుకోకుండా మరింత దూకుడుగా వెళ్లాలని డిసైడ్ అయ్యారని టాక్.. ఆ దిశగా ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేసినట్టు సమాచారం.

  ఇదీ చదవండి : చంద్రబాబు సంచలన నిర్ణయం.. కంచుకోట నుంచే ప్రక్షాళన.. కోవర్టుల ఏరివేత

  కుప్పంలో బరిలో నిలిచే వైసీపీ అభ్యర్థి ఎవరు..?
  కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో 25 వార్డుల్లో 19 చోట్ల గెలిచి సత్తాచాటి.. వచ్చే సార్వత్రిక ఎన్నికలే తమ టార్గెట్ అని మాటల తూటాలు పేల్చారు మంత్రి పెద్దిరెడ్డి. 2024లో కుప్పం తమదేనని ప్రకటించారు. పాపం చంద్రబాబు అని సెటైర్లు వేశారు మంత్రి. అధికారంలో ఉండటంతో వైసీపీ కుప్పం లోకల్‌ ఎన్నికల్లో గెలిచిందని చంద్రబాబు అండ్‌ కో భావించినా.. వైసీపీ నేతలు మాత్రం పక్కా ప్లాన్‌ అమలు చేస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో కుప్పం బరిలో నిలిచే అభ్యర్ధి వేటను పంచాయతీ ఎన్నికల తర్వాత మొదలుపెట్టినా.. మున్సిపల్‌ ఫలితాల తర్వాత క్లారిటీకి వచ్చిందంటున్నారు.

  ఇదీ చదవండి : ఉదయం భార్య పిల్లలతో వీడియో కాల్.. ఇంతలో ఊహించని విషాదం.. చివరి మాటలు ఇవే

  బరిలోకి మంత్రి పెద్దిరెడ్డి తమ్ముడు కుమారుడు .!
  గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన చంద్రమౌళి అనారోగ్యంతో చనిపోవడంతో ఆ స్థానాన్ని ఆయన కుమారుడు భరత్‌కు అప్పగించారు. ఇప్పుడు భరత్‌కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి.. కుప్పం కొత్త సారథి కోసం సీరియస్‌గా దృష్టి పెట్టారట. ఆ కొత్త సారథి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం నుంచే ఉంటారనే చర్చ పార్టీ వర్గాల్లో సంచలనంగా మారింది. ఇప్పటికే చంద్రబాబు, మంత్రి పెద్దిరెడ్డి మధ్య రాజకీయ సెగలు రేగుతున్నాయి. అలాంటిది ఏకంగా పెద్దిరెడ్డి కుటుంబం నుంచే చంద్రబాబుపై ఒకరు పోటీకి దిగుతారని ప్రచారం జరుగుతుండటంతో ఆసక్తి రేకెత్తిస్తోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు కుమారుడైన సుధీర్‌రెడ్డి బరిలో ఉంటారని తెలుస్తోంది. సుధీర్‌రెడ్డి ప్రస్తుతం పుంగనూరు సదుం, సోమల మండలాల ఇంఛార్జ్‌గా ఉన్నారు.

  ఇదీ చదవండి : ఇలియానా ఏంటి ఇలా మారింది..? టాలీవుడ్ బ్యూటీలను చూసేందుకు ఎగబడ్డ జనం

  మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం నుంచి ఇప్పటికే ఆయన కుమారుడు మిధున్‌రెడ్డి ఎంపీగా కొనసాగుతున్నారు. అలాగే పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథ్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. వీరందరి శిక్షణలో సుధీర్‌రెడ్డి కుప్పంలో రాటుదేలుతారని అనుకుంటోంది పార్టీ కేడర్‌. త్వరలోనే సుధీర్‌రెడ్డిని కుప్పం వైసీపీ ఇంఛార్జ్‌గా ప్రకటించి స్పెషల్‌ ఆపరేషన్‌ స్టార్ట్‌ చేస్తారని తెలుస్తోంది. అయితే ఎమ్మెల్సీగా ఉన్న భరత్‌ అసెంబ్లీ ఎన్నికల నాటికి తన పదవికి రాజీనామా చేసి బరిలో దిగుతారనే వాదన కూడా ఉంది. ఒకవేళ అధిష్ఠానం భరత్‌వైపు మొగ్గు చూపితే.. సుధీర్‌రెడ్డి పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వైసీపీ వర్గాలు దీనికీ సోషల్‌ మీడియాలో సమాధానాలు చెప్పేస్తున్నాయి. పీలేరు లేదా పలమనేరు నుంచి సుధీర్‌రెడ్డి బరిలో దిగొచ్చనే చర్చను తీసుకొస్తున్నారు. 2022 ఆరంభంలోనే దీనిపై వైసీపీ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Chandrababu naidu, Kuppam, Peddireddy Ramachandra Reddy

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు