Home /News /andhra-pradesh /

వైసీపీ మహిళా ఎమ్మెల్యేపై అసభ్యకరమైన పోస్టులు...

వైసీపీ మహిళా ఎమ్మెల్యేపై అసభ్యకరమైన పోస్టులు...

ఎమ్మెల్యే శ్రీదేవి (File)

ఎమ్మెల్యే శ్రీదేవి (File)

తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై కొందరు అనుచిత వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై కొందరు అనుచిత వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు వైసీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. తాడికొండ వైసీపీ నాయకులు ఈ మేరకు తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

    ఏపీలో ఓ వైపు జగన్ ప్రభుత్వం.. ఆడవారిపై వేధింపులకు దిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తుంటే.. మరోవైపు జగన్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలపైనే.. కొందరు అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారు. కొన్ని రోజుల క్రితం వైసీపీ మరో ఎమ్మెల్యే విడదల రజినిపై ఇద్దరు యువకులు అభ్యంతరకర పోస్టులు పెట్టారు. దీంతో ఆ ఇద్దర్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేను కించపరిచే విధంగా నెల్లూరు జిల్లాకు చెందిన యువకులు సత్యంరెడ్డి, ప్రవీణ్ లు సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చేశారు. ఈ విషయమై ఆరా తీసిన చిలకలూరిపేట పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

    అంతకుముందు ఏపీ హోంమంత్రి సుచరితపై ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర పోస్టు పెట్టిన వ్యక్తిని కూడా గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అశోక్ కుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేసినట్టు సమాచారం.రామ్ మహరాజ్ అనే ఫేస్‌బుక్ ఐడీతో సుచరిత ప్రతిష్టను దెబ్బతీసేలా అతను పోస్టులు పెట్టినట్టు తెలుస్తోంది.నిందితుడు విశాఖ జిల్లా కొత్తపట్నం గ్రామానికి చెందిన రాము అనే యువకుడిగా గుర్తించారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Vundavalli sridevi, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు