పెళ్లి పీటలెక్కిన అరకు ఎంపీ.. స్వగ్రామంలో ఘనంగా వివాహం

ఈ నెల 22న రుషికొండలోని సాయిప్రియ బీచ్ రిసార్ట్‌లో రిసెప్షన్ జరగనుంది.రిసెప్షన్‌కు ఏపీ సీఎం జగన్ హాజరుకానున్నారు.

news18-telugu
Updated: October 18, 2019, 2:46 PM IST
పెళ్లి పీటలెక్కిన అరకు ఎంపీ.. స్వగ్రామంలో ఘనంగా వివాహం
అరకు ఎంపీ మాధవి పెళ్లి
  • Share this:
అరకు ఎంపీ గొడ్డేటి మాధవి పెళ్లి పీటలెక్కారు. తన బాల్యమిత్రుడు శివప్రసాద్‌ను మాధవి వివాహం చేసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 03.15 నిమిషాలకు మాధవి స్వగ్రామం శరభన్నపాలెలో పెళ్లి వేడుక జరిగింది. బంధు మిత్రుల సమక్షంలో, మేలతాళాల మధ్య మాధవి-శివప్రసాద్ ఏడు అడుగులు వేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు, నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌, మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబుతో పాటు పార్టీ నేతలు ఎంపీ మాధవిని ఆశీర్వదించారు. ఇక ఈ నెల 22న రుషికొండలోని సాయిప్రియ బీచ్ రిసార్ట్‌లో రిసెప్షన్ జరగనుంది.రిసెప్షన్‌కు ఏపీ సీఎం జగన్ హాజరుకానున్నారు.

వివాహానికి ముందు ఈ జంట తీసుకున్న ప్రివెడ్డింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.

మాధవి భర్త శివప్రసాద్ స్వస్థలం విశాఖపట్టణం జిల్లా గొలుగొండ మండలం కెడిపేట గ్రామం. ఎంబీయే పూర్తి చేసిన ఆయన ప్రస్తుతం ఓ ప్రైవేట్ కాలేజీని నిర్వహిస్తున్నారు. ఇక గతంలో టీచర్‌గా పనిచేసిన గొడ్డేటి మాధవి ఏప్రిల్/మే లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అరకు పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అరకులో టీడీపీ అభ్యర్థి, మాజీ కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్‌పై సుమారు 2 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 26 ఏళ్ల వయసులోనే ఎంపీగా ఎన్నికై అందరి దృష్టిని ఆకర్షించారు మాధవి.

First published: October 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading