రాజకీయ పార్టీల వ్యూహాలు ఎప్పుడు ఏ రకంగా ఉంటాయో ఊహించడం చాలా కష్టం. తాజాగా మెగా ఫ్యామిలీ విషయంలో వైసీపీ వ్యూహం ఎలా ఉందనే దానిపై రాజకీయవర్గాల్లో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. మెగా ఫ్యామిలీలోని పవన్ కళ్యాణ్ వైసీపీకి రాజకీయ ప్రత్యర్థి. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. ఆయనను నేరుగానే వైసీపీ టార్గెట్ చేస్తుంటుంది. అయితే పవన్ కళ్యాణ్ అన్న, మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) విషయంలో మాత్రం వైసీపీ సానుకూలంగా ఉంటూ వచ్చింది. సినీ ఇండస్ట్రీ పరిశ్రమ సమస్యల గురించి సీఎం జగన్ దగ్గరకు వెళ్లే బృందానికి నాయకత్వం వహించింది కూడా చిరంజీవి. అలా సీఎం జగన్‌ను చిరంజీవి అనేకసార్లు కలిశారు.
పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసే సీఎం జగన్ .. మెగాస్టార్‌కు మాత్రం ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపించేవారు. సీఎం జగన్‌తో పాటు వైసీపీ నేతలంతా పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసి మెగాస్టార్ విషయంలో మాత్రం సానుకూలంగా ఉన్నట్టు వ్యవహరించారు.
అయితే కొద్దిరోజుల క్రితం పవన్ కళ్యాణ్‌తో పాటు మొత్తం మెగాఫ్యామిలీని టార్గెట్ చేశారు రోజా(Roja). దీంతో అసలు రోజాకు చిరంజీవిని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అంతా అనుకున్నారు. అయితే ఇటీవల మరోసారి మెగా ఫ్యామిలీ మొత్తాన్ని టార్గెట్ చేశారు రోజా. ఆ ఫ్యామిలీ అంటే పలువురు నటులకు ప్రేమ లేదని.. వాళ్లంటే భయమని ఆరోపించారు. వాళ్లు చెప్పినట్టు వినకపోతే తమకు సినీ అవకాశాలు తగ్గిపోతాయని వారంతా భయపడుతున్నారని విమర్శించారు. అసలు మెగా ఫ్యామిలీ (Mega Heros) హీరోల వల్ల ఏమీ కాదని ఎద్దేవా చేశారు.
Ganta Srinivasa Rao: రూటు మార్చిన గంటా.. లోకేష్ పాద యాత్రపై సంచలన వ్యాఖ్యలు
Tirupati: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఈ 5 చోట్ల మినీ అన్నప్రసాద భవనాలు
అయితే ఉన్నట్టుండి రోజా మరోసారి మెగా ఫ్యామిలీ మొత్తాన్ని టార్గెట్ చేయడం వెనుక అసలు కారణం ఏంటనే దానిపై రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ వెనుక ఉందని వైసీపీ నాయకత్వం భావిస్తోందని.. అందుకే ఎన్నికలకు ముందు ఆ ఫ్యామిలీ మొత్తాన్ని రాజకీయంగా టార్గెట్ చేయాలని డిసైడయ్యిందని పలువురు విశ్లేషిస్తున్నారు. రోజా మెగా ఫ్యామిలీని రాజకీయంగా ఎటాక్ చేయడం వెనుక ఇది కూడా ఓ ప్రధాన కారణమనే చర్చ జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Mega Family, MLA Roja