YSR Rythu Bharosa: రైతన్నలకు సీఎం జగన్ గుడ్‌న్యూస్‌... రైతులు ఇలా చెయ్యండి

రైతన్నలకు సీఎం జగన్ గుడ్‌న్యూస్‌... రైతులు ఇలా చెయ్యండి (File Image)

AP CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు మేలు చేసే మరో నిర్ణయం తీసుకుంది. ఇవాళ రైతులకు ఆ మేలు జరగనుంది. ఇందుకోసం రైతులు ఏం చెయ్యాలో తెలుసుకుందాం.

  • Share this:
    YSR Rythu Bharosa - PM Kisan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ రైతులకు డబ్బు ఇవ్వబోతోంది. వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలో భాగంగా లబ్దిదారులైన రైతుల బ్యాంకు అకౌంట్లలో మొత్తం రూ.1,766 కోట్లను వేయబోతోంది. ఇవి వైఎస్సార్‌ రైతు భరోసా పీఎం కిసాన్‌ పథకంలో మూడోసారి ఇస్తున్న నిధులు. అక్టోబరులో వచ్చిన నివర్‌ తుఫాను వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్‌ సబ్సిడీ) కింద ప్రభుత్వం ఈ డబ్బు ఇస్తోంది. తాడేపల్లి క్యాంపు ఆఫీస్ నుంచి నేడు సీం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కంప్యూటర్‌ బటన్ నొక్కి ఈ డబ్బులను అర్హులైన రైతుల బ్యాంకు అకౌంట్లలో జమ అయ్యేలా చేస్తారు. ఏ సీజన్‌లో పంట నష్టపోతే ఆ సీజన్‌లోనే పెట్టుబడి రాయితీ ఇస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన వైసీపీ... అది అమలు చేస్తోంది. నవంబర్‌ చివర్లో నివర్‌ తుఫాను వచ్చింది. నెల రోజుల్లో ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తోంది.

    ప్రభుత్వం ఇస్తున్న నిధుల్లో కేంద్రం అందించే ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి సొమ్ము కూడా ఉంటుంది. కేంద్రం ఏడాదికి రూ.6,000 రైతులకు పెట్టుబడి సాయంగా ఇస్తోంది. కౌలు రైతులతో పాటు ROFR పొంది సాగుచేస్తున్న రైతుకు కూడా డబ్బు ఇస్తారు. మూడు విడతల్లో సంవత్సరానికి మొత్తం రూ.13,500 లెక్కన పెట్టుబడి సాయం అందిస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే రెండు విడతల్లో రూ.11,500 సాయంగా ఇచ్చిన ప్రభుత్వం ఇవాళ మూడో విడతలో రూ.2000 అకౌంట్లలో జమ జేయనుంది.

    దాదాపు 51 లక్షల రైతు ఖాతాల్లో రూ.1120 కోట్లు ఇవాళ జమ చేయనున్నారు. మిగతా రూ.646 కోట్లను ప్రభుత్వం నివర్‌ తుఫాను వల్ల దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటల రైతులకు పెట్టుబడి రాయితీ కింద సోమవారం నిధులు విడుదల చేసింది. మొత్తం 12 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నట్టు అంచనా కట్టారు. ఈ సంవత్సరం ఖరీఫ్‌లో జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన 1.66 లక్షల మంది రైతులకు రూ.135.73 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని అక్టోబర్‌ 27న వారి అకౌంట్లలో ప్రభుత్వం వేసింది. అక్టోబరులో వచ్చిన భారీ వర్షాలు, వరదల్లో నష్టపోయిన రైతులకు రూ.132 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చింది.

    ఇది కూడా చదవండి:Datta Jayanti 2020 Date: దత్తాత్రేయ స్వామి ప్రత్యేకత ఏంటి? ఎలా పూజించాలి?

    అవినీతికి నో ఛాన్స్:
    ఈ పథకం అమలులో డబ్బు రైతుల అకౌంట్లలోకి డైరెక్టుగా వెళ్తోంది కాబట్టి... మధ్యలో మధ్యవర్తులెవరూ జోక్యం చేసుకునే పరిస్థితి లేదు. అందువల్ల పెట్టుబడి సాయాన్ని రైతులు డైరెక్టుగా పొందగలరు. ఆ డబ్బుతో... పంటలు వేసుకోవడానికీ, ఎరువులు కొనుక్కోవడానికీ వీలవుతుంది. ఈ సొమ్మును బ్యాంకులు పాత బాకీల కింద తీసుకోవడానికి వీల్లేకుండా సీఎం జగన్ చర్యలు తీసుకున్నారు. రైతులకు ఏ సమస్య వచ్చినా 155251 హెల్ప్‌లైన్‌ నంబరుకి కాల్ చేసి చెప్పమన్నారు. అందువల్ల బ్యాంకులు ఈ డబ్బును రైతులకు ఇవ్వాల్సిందే తప్ప... వేరేగా మళ్లించడానికి వీల్లేదు.
    Published by:Krishna Kumar N
    First published: