రైతులకు శుభవార్త.. రైతు భరోసా పెట్టుబడి సాయం పెంపు

మేలో 7500, రబీలో 4,000, సంక్రాంతికి రూ.2వేలు ఇస్తామని చెప్పారు.

news18-telugu
Updated: October 14, 2019, 2:37 PM IST
రైతులకు శుభవార్త.. రైతు భరోసా పెట్టుబడి సాయం పెంపు
వరి నాట్లు పెడుతున్న రైతు
  • Share this:
ఏపీ రైతులకు వైసీపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతు భరోసా పథకం కింద ఇచ్చే పెట్టుబడి సాయాన్ని సీఎం జగన్ పెంచారు. పెట్టుబడి సాయాన్ని రూ.12,500కు బదులు రూ.13,500 ఇవ్వాలని నిర్ణయించినట్లు వ్యవసాయమంత్రి కురసాల కన్నబాబు ప్రకటించారు. అంతేకాదు నాలుగేళ్లకు ఐదేళ్ల పాటు పథకాన్ని వర్తింపజేస్తామని తెలిపారు. ఏటా రూ.13,500ను నేరుగా రైతుల ఖాతాల్లో జమచేస్తామన్న కన్నబాబు.. మూడు విడతల్లో రైతు భరోసా డబ్బును పంపిణీ చేస్తామని వెల్లడించారు. మేలో రూ.7500, రబీలో రూ.4,000, సంక్రాంతికి రూ.2వేలు ఇస్తామని చెప్పారు. రైతులు, రైతులు ప్రతినిధి సంఘాల డిమాండ్ మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు మంత్రి.

మంగళవారం నుంచే రైతు భరోసా పథకం అమల్లోకి రానుంది. నెల్లూరు జిల్లా కాకుటూరులో సీఎం వైఎస్‌ జగన్‌ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు విక్రమసింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణానికి సీఎం జగన్ చేరుకుంటారు. అనంతరం కౌలు రైతులకు కార్డులు చేయడంతో పాటు రైతులకు రైతుభరోసా కింద వ్యవసాయ పెట్టుబడి సాయంగా చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే రైతు భరోసా పథకానికి రూ. 5,510 కోట్లను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.




First published: October 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...