Home /News /andhra-pradesh /

YSR RYTHU BHAROSA AP GOVERNMENT STARTS RYTHU BHAROSA SCHEME FOR FARMERS NK

ఏపీలో రైతు భరోసా ప్రారంభించిన సీఎం జగన్... కౌలు రైతులకు చెక్కుల పంపిణీ

సీఎం జగన్

సీఎం జగన్

రైతుల పక్షపాతిగా చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం... వారి కోసం అద్భుతమైన స్కీం రైతు భరోసాను తెచ్చింది. మేనిఫెస్టోలో చెప్పినదాని కంటే ఎక్కువ మొత్తం ఇస్తోంది.

    YSR Rythu Bharosa : ఆంధ్రప్రదేశ్‌లో రైతు భరోసా పథకం అమల్లోకి వచ్చింది. నెల్లూరు జిల్లా... కాకుటూరులో సీఎం వైఎస్‌ జగన్‌ ఈ పథకాన్ని ప్రారంభించారు. విక్రమసింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సీఎం జగన్... పథకాన్ని ప్రారంభించి... కౌలు రైతులకు రైతు భరోసా పథకం కార్డులు ఇవ్వడంతో పాటూ... రైతులకు రైతు భరోసా పథకం కింద వ్యవసాయ పెట్టుబడి సాయంగా చెక్కులు ఇచ్చారు. ఈ రైతు భరోసా పథకానికి రూ.5,510 కోట్లను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ స్కీం ద్వారా... ఏపీలో 50 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం తెలిపింది. 3 లక్షల మంది కౌలు రైతులకు కూడా మేలు జరుగుతుందని వివరించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు... మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు రైతు భరోసా పథకం వర్తించదు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు ఈ పథకం కింద ప్రయోజనం పొందగలరు.

    రైతు భరోసా పథకం ప్రారంభానికి ముందు రోజే... ఏపీ ప్రభుత్వం రైతులకు ఆనందం కలిగించే నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా పథకం కింద ఇచ్చే పెట్టుబడి సాయాన్ని సీఎం జగన్ పెంచారు. పెట్టుబడి సాయాన్ని రూ.12,500కు బదులు రూ.13,500 ఇవ్వాలని నిర్ణయించినట్లు వ్యవసాయమంత్రి కురసాల కన్నబాబు ప్రకటించారు. అంతేకాదు నాలుగేళ్లకు ఐదేళ్ల పాటు పథకాన్ని వర్తింపజేస్తామని తెలిపారు. ఏటా రూ.13,500ను నేరుగా రైతుల ఖాతాల్లో జమచేస్తామన్న కన్నబాబు... మూడు విడతల్లో రైతు భరోసా డబ్బును పంపిణీ చేస్తామని వివరించారు. మేలో రూ.7,500, రబీలో రూ.4,000, సంక్రాంతికి రూ.2వేలు ఇస్తామని చెప్పారు. రైతులు, రైతు ప్రతినిధి సంఘాల డిమాండ్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు మంత్రి.


    Pics : రియల్ లైఫ్ బార్బీ గర్ల్ అంజెలికా క్యూట్ ఫొటోస్ 


    ఇవి కూడా చదవండి :


    నేడు ఉత్తరాంధ్రలో పైడితల్లి సిరిమానోత్సవం... ఇదీ చరిత్ర

    ఆర్టీసీ జేఏసీతో నేడు ప్రభుత్వం చర్చలు ?... సమ్మెను సాయంత్రం విరమిస్తారా?

    Health Tips : మంచి తేనెను గుర్తించడం ఎలా?


    Health Tips : పుట్టగొడుగుల సూప్... తయారీ విధానం ఇదీ...
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ysr rythu bharosa

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు