ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్ సొమ్మును అందజేస్తున్నారు. 2,37,615 మంది వలంటీర్లు పింఛన్ల పంపిణీలో నిమగ్నమయ్యారు. కరోనా నేపథ్యంలో బయోమెట్రిక్‌కు బదులు పెన్షనర్ల ఫోటోలను జియో ట్యాగింగ్ చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేక యాప్‌ను సిద్ధం చేశారు. కాగా, పింఛన్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 58.22 లక్షల మందికి రూ.1421.20 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap cm ys jagan mohan reddy, AP News, AP Politics, Ysr pension scheme