హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan : ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడు లబ్దిదారులకు మనీ పంపిణీ

YS Jagan : ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడు లబ్దిదారులకు మనీ పంపిణీ

సీఎం వైఎస్ జగన్ (File Image)

సీఎం వైఎస్ జగన్ (File Image)

YS Jagan : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1వ తారీకు రాగానే కొన్ని పథకాలను పక్కాగా అమలు చేసేందుకు వాలంటీర్లను నియమించింది. ఆ ప్రకారం ఫిబ్రవరి 1న వాలంటీర్లు.. కీలక పథకానికి నగదు పంపిణీ చేయబోతున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

YSR Pension Scheme : ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్ పథకం కింద మనీ పంపిణీ జరగనుంది. మొత్తం 63 లక్షల 87 వేల మంది లబ్దిదారులకు వాలంటీర్లు డబ్బు ఇవ్వబోతున్నారు. మొత్తం రూ.1,759.99 కోట్లను పంపిణీ చేస్తారు. ఈ మనీ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది.

రూల్ ప్రకారం ఈ డబ్బును ఇంటింటికీ వెళ్లి ఇవ్వాల్సి ఉంటుంది. ఐదు రోజుల్లో పంపిణీ పూర్తి చెయ్యాల్సి ఉంటుంది. ఐతే.. చాలా చోట్ల వాలంటీర్లు.. ఒకట్రెండు రోజుల్లోనే పంపిణీ పూర్తి చేస్తున్నారు.

ఈ పెన్షన్లు జనవరి నెలకు సంబంధించినవి. అందువల్ల వీటిని ఎంత త్వరగా ఇచ్చేస్తే అంత మంచింది. లబ్దిదారులు కూడా ఈ పెన్షన్ అందుకునేందుకు అందుబాటులో ఉంటే.. వాలంటీర్లు రాగానే వెంటనే తీసుకోవచ్చు. ఫిబ్రవరి 1న (నేడు) తెల్లవారు జాము నుంచే పంపిణీ చేసేస్తామని చాలా మంది వాలంటీర్లు చెబుతున్నారు.

ఈ పనిని సమర్థంగా పూర్తి చెయ్యడానికి గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 2.66 లక్షల మంది వాలంటీర్లు సిద్ధంగా ఉన్నారు. మనీ ఇచ్చేటప్పుడు ఇచ్చినట్లుగా రుజువు ఉండేందుకు వారు బయోమెట్రిక్, ఐరిస్ విధానాలను అమలుచేస్తున్నారు. తద్వారా అందరికీ పెన్షన్ ఇచ్చినట్లుగా ప్రూఫ్ ప్రభుత్వం దగ్గర ఉంటుంది. ఎవరికైనా పెన్షన్ అందకపోతే.. ఈజీగా తెలిసిపోతుంది. వారికి కూడా పింఛన్ ఇచ్చే వీలు ఉంటుంది.

పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో.. 15 వేల మంది వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్, వార్డ్ వెల్ఫేర్ డెవలప్‌మెంట్ సెక్రటరీలు కూడా పాలుపంచుకుంటారని ప్రభుత్వం చెప్పింది. ఐతే.. పెన్షన్ల పంపిణీలో కొంతమంది వాలంటీర్లు కమీషన్లు తీసుకుంటున్నారనే వాదన ఉంది. లబ్దిదారుల నుంచి ఏడాదికి రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకూ కమీషన్‌ను వాలంటీర్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే వాదనలు ఉన్నాయి.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, Gram volunteer, Ward Volunteers, Ys jagan, Ysr pension scheme