Home /News /andhra-pradesh /

YSR PELLIKANUKA SCHEME NOT IMPLEMENTING IN ANDHRA PRADESH EVEN YS JAGAN PROMISED IN ELECTION MANIFESTO FULL DETAILS HERE PRN

Andhra Pradesh: ఆ పథకం విషయంలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీని మరిచారా...?

వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు (AP Welfare Schemes) అమలు చేస్తోంది. ఇందుకోసం ఓ క్యాలెండర్ ను రూపొందించి నెలకు రెండుకు తగ్గకుండా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేలా ప్రణాళికలు రూపొందించింది.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఇందుకోసం ఓ క్యాలెండర్ ను రూపొందించి నెలకు రెండుకు తగ్గకుండా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేలా ప్రణాళికలు రూపొందించింది. జగనన్న అమ్మఒడి, వైఎస్ఆర్ రైతు భరోసా, విద్యాకానుక, చేయూత, కాపునేస్తం ఇలా ప్రతిపథకాన్ని అమలు చేస్తోంది. అన్ని బాగానే ఉన్నా ఓ పథకం విషయంలో ఇంకా సందిగ్ధత నెలకొంది. అదే వైఎస్ఆర్ పెళ్లి కానుక. కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లు కావొస్తున్న ఈ పథకంపై స్పష్టత రాలేదు. ఇటీవల విడుదల చేసిన సంక్షేమ పథకాల క్యాలెండర్లోనూ వైఎస్ఆర్ పెళ్లికానుక పథకానికి చోటు దక్కలేదు. దీంతో ఈ పథకం వస్తుందని ఆశలు పెట్టుకున్నవారిలో ఆందోళన నెలకొంది.

    తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రన్న పెళ్లి కానుక పేరుతో ఈ పథకం అమలైంది. దీని కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల ఇళ్లలో పెళ్లిళ్లకు కనిష్టంగా రూ.20 వేల నుంచి గరిష్టంగా రూ.50 వేలు పెళ్లి సమయంలో ఆర్ధిక సాయం అందించేవారు. 2019 ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే పెళ్లికానుక కింద ఇచ్చే ఆర్ధిక సాయాన్ని పెంచుతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆ మేరకు 2019 సెప్టెంబర్ లో పెళ్లి కానుక కింద ఇచ్చే ఆర్ధికసాయాన్ని రూ.లక్షకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అలాగే ఈ పెంపు 2020 ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వస్తుందని కూడా చెప్పింది.

    ఇది చదవండి: ఏపీలో మేయర్లు, కౌన్సిలర్ల జీతాలు ఎలా ఉంటాయో తెలుసా..?



    అప్పటి నుంచి ఈ పథకం అమలు అయోమయంలో ఉంది. ప్రభుత్వం అమలు చేస్తామని ప్రకటించిన సమయానికి కరోనా వల్ల పెళ్లిళ్లు నిలిచిపోయాయి. లాక్ డౌన్ సడలింపుల తర్వాత పెళ్లిళ్లు జరుగుతున్నా.. ఈ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు మొదలుకాలేదు. ఐతే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ఏడాది మార్చి వరకు రిజిస్ట్రేషన్లు కొనసాగించారు. అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న 90వేల మంది లబ్ధిదారులకు ఆర్ధిక సాయం అందాల్సి ఉన్నా నేటికీ స్పష్టత రాలేదు. రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.350 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది.

    అర్హులైన పేదల ఇళ్లలో ఆడపిల్లల విహాస సమయంలో వైఎస్ఆర్ పెళ్లికానుక కింద ఆర్ధిక సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వారి సామాజిక వర్గాల వారిగా దాదాపు రూ.1,50,000 వరకు ఆర్ధిక సాయాన్ని ప్రభుత్వం ప్రకటించినా ఇంతవరకు అమలు కాకపోవడం, అసలు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకపోవడంతో ఈ పథకంపై ఆసలు పెట్టుకున్న పేదలు ఆందోళన చెందుతున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap government, Telugu news, Ysr pelli kanuka

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు