Home /News /andhra-pradesh /

YSR NAME FOR RYTHU BHAROSA CENTRS IN ANDHRA PRADESH AK

రైతు భరోసా కేంద్రాలకు వైఎస్ఆర్ పేరు

ఏపీ సీఎం జగన్(ఫైల్ ఫోటో)

ఏపీ సీఎం జగన్(ఫైల్ ఫోటో)

రైతులకు మాజీ సీఎం వైఎస్సార్‌ చేసిన సేవలకు గుర్తుగా ఆయన పేరును ఖరారు చేసినట్లు జగన్ సర్కార్ ఉత్తర్వుల్లో పేర్కొంది.

    తమ ప్రభుత్వంలోని అనేక పథకాలకు వైఎస్ఆర్ పేరు పెడుతున్న జగన్ సర్కార్.. తాజాగా రైతు భరోసా కేంద్రాలకు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పేరును పెడుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై రైతు భరోసా కేంద్రాలను డాక్టర్‌ వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలుగా ప్రభుత్వం వ్యవహరించనుంది. రైతులకు మాజీ సీఎం వైఎస్సార్‌ చేసిన సేవలకు గుర్తుగా ఆయన పేరును ఖరారు చేసినట్లు జగన్ సర్కార్ ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలో రైతుల దగ్గరకే సాగుకు సంబంధించిన సమస్త సేవలు పొందే వినూత్న వ్యవస్థ రైతు భరోసా కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా మే 30న సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ‌ రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. తాజాగా ఈ కేంద్రాలకు వైఎస్ఆర్ పేరు పెడుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.




    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Ysr rythu bharosa

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు