హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Good News: వారి అందరికీ శుభవార్త.. లక్షరూపాయలు అందించే కార్యక్రమానికి నేటి నుంచి శ్రీకారం

Good News: వారి అందరికీ శుభవార్త.. లక్షరూపాయలు అందించే కార్యక్రమానికి నేటి నుంచి శ్రీకారం

రాష్ట్ర వ్యాప్తంగా ఆడపిల్లలకు గుడ్ న్యూస్

రాష్ట్ర వ్యాప్తంగా ఆడపిల్లలకు గుడ్ న్యూస్

Good News: ఆంధ్రప్రదేశ్ లో ఆడపిల్లలకు గుడ్ న్యూస్.. వారి ఖాతాల్లో లక్ష రూపాయలు వేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. నేటి నుంచి ఆ కార్యక్రమానికి నేటి నుంచి శ్రీకారం చుడుతున్నారు. అయితే దీనికి అర్హతలు ఏంటో తెలుసా..?

 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India

  Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

  Good News:  సంక్షేమ పథకాలకు కేరాఫ్ తానే అని సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) నిరూపించుకుంటున్నారు. వరుసగా సంక్షేమ పథకాలు (AP Welfare Schemes) అందిస్తూనే ఉన్నారు. కొత్త  కొత్త పథకాలు అందిస్తున్నారు. గతంలో ప్రకటించిన వారికి సైతం విరామం లేకుండా విడతల వారిగా నిధులు విడుదల చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు రెండు పథకాలకు శ్రీకారం చడుతున్నారు.  తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా  నేటి నుంచి  వైఎస్సార్ కళ్యాణమస్తు (YSR Kalyanamasthu), వైఎస్సార్ షాదీ తోఫా (YSR Sadhi Thopha) లను ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా వైఎస్సార్ కళ్యాణమస్తు,  వైఎస్సార్ షాదీ తోఫా” వెబ్ సైట్ ప్రారంభం అయ్యింది.  ఈ పథకాల ద్వారా కేవలం పేద ఆడపిల్లలకు ఆర్థిక సాయం చేయడం ఒక్కటే కాదు..

  ఈ పథకం ఉద్దేశాలు ఏంటంటే..? పిల్లల చదువును ప్రోత్సహించడం, బాల్య వివాహాల నివారణ, పాఠశాలల్లో చేరికల శాతం పెంచడం.. అలాగే డ్రాపౌట్ రేట్ ను తగ్గించడం..  ఈ కారణాలతో పాటు పెళ్లిళ్లు చేయలేక ఇబ్బంది పడుతున్న పేద తల్లిదండ్రులకు అండగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది.

  అయితే దరఖాస్తు చేసుకునే వధూవరులిరువురుకీ టెన్త్ క్లాస్ ఉత్తీర్ణత తప్పనిసరి చేశారు. అలా చేయడంతో పిల్లల చదువును ప్రోత్సహించడం.. బాల్య వివాహాలను నివారించడం.. పాఠశాలల్లో చేరికల శాతాన్ని పెంచడం.. డ్రాపౌట్ రేట్ ను తగ్గించడం జరుగుతాయన్న విషయాన్ని స్వయంగా సీఎం జగన్ మోమన్ రెడ్డే చెప్పారు.

  వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలను  రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.  అందులో భాగంగా  ఈ పథకాలకు సంబంధించిన సీఎం..  జగన్ మోహన్ రెడ్డి  వెబ్ సైట్ ను ప్రారంభించారు. ఇక నేటి నుంచి  రాష్ట్ర వ్యాప్తంగా  అమల్లోకి రానున్నాయి.

  ఇదీ చదవండి మహాలక్ష్మీ దేవిగా కనకదుర్గమ్మ.. నేడు దర్శించుకుంటే.. ధనలాభం.. విద్య , సౌభాగ్యం అన్నీ సొంతం

  వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా ఆర్థికసాయం భారీగా పెంపు :          షాదీ తోఫా పథకాలకు సంబంధించి 6 దశల్లో తనిఖీలు ఉంటాయని సమచారం. వధూవరులు ఇద్దరి కుటుంబ సభ్యుల వివరాలను పరిగణలోకి తీసుకుంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు వర్తించనుంది. ముస్లింలకు షాదీ తోఫా పేరుతో ఈ పథకం వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ వధూవరులకు లక్ష, ఒకవేళ వీరు కులాంతర వివాహం చేసుకుంటే 1.20 లక్షలు ఇస్తారు. బీసీలకు 50 వేలు, వీరు కులాంతర వివాహం చేసుకుంటే 75 వేల ఆర్థిక సాయం ఉంటుంది. మైనార్టీలకు లక్ష, దివ్యాంగులైతే 1.50 లక్షలు ఇస్తారు. భవన నిర్మాణ కార్మికులకు 40 వేలు ప్రభుత్వం సాయం చేస్తుంది.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap government, AP News, Ap welfare schemes

  ఉత్తమ కథలు