Home /News /andhra-pradesh /

YSR BHEEMA SCHEME ANDHRA PRADESH CM JAGAN MOHAN REDDY TO DISTRIBUTE RUPEES 254 CRORE TODAY TO BENEFICIARIES NK

YSR Bheema: నేడు ఏపీ సీఎం వైఎస్ జగన్ రూ.254 కోట్లు జమ... లబ్దిదారులకు మేలు

నేడు ఏపీ సీఎం వైఎస్ జగన్ రూ.254 కోట్లు జమ... లబ్దిదారులకు మేలు

నేడు ఏపీ సీఎం వైఎస్ జగన్ రూ.254 కోట్లు జమ... లబ్దిదారులకు మేలు

YSR Bheema Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రకరకాల పథకాలు ప్రవేశపెట్టింది. వాటిలో వైఎస్‌ఆర్ బీమా స్కీమ్ ఎంతో మందికి మేలు చేస్తోంది. దీని గురించి కీలక విషయాలు తెలుసుకుందాం...

    AP YSR Bheema Scheme: ఆంధ్రప్రదేశ్‌లో వివిధ పథకాలకు... ఎప్పుడెప్పుడు ఎంతెంత డబ్బు ఇవ్వాలో... అంతంత డబ్బును కచ్చితంగా విడుదల చేస్తోంది ప్రభుత్వం ఫలితంగా లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లలోకి ఆ డబ్బు కచ్చితమైన సమయంలో జమ అవుతోంది. ఎక్కడైనా తేడా వస్తే... వెంటనే గ్రామ లేదా వార్డు సచివాలయ వాలంటీర్లకు కంప్లైంట్ వెళ్తోంది. వాళ్లు వెంటనే సమస్య సాల్వ్ అయ్యేలా చేస్తున్నారు. అందువల్ల పథకాల అమలు పక్కాగా అమలవుతోందనే వాదన ఉంది. అందులో భాగంగానే నేడు మరో పథకానికి నిధులు విడుదల చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆ పథకమే వైఎస్ఆర్ బీమా పథకం. ఏవైనా అనుకోని విపత్తుల వలన కుటంబ సభ్యులు ఇంటి పెద్దను కోల్పోతే... అలాంటి వారిని ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఆదుకుంటోంది. ఈ స్కీం కింద 12,039 కుటుంబాలకు లబ్ది అందిస్తోంది సర్కార్.

    ఈ పథకం ఎప్పుడు ప్రారంభమైంది?
    2020 అక్టోబర్‌ 21న ఈ పథకం ప్రారంభమైంది.

    ఇప్పటివరకూ ఎంత మంది పేర్లు నమోదు చేయించుకున్నారు?
    12,039 మంది మరణించగా... వారి కుటుంబ సభ్యులకు లబ్ది లభిస్తోంది.

    డబ్బు ఎప్పుడు ఇస్తారు?
    నేటి ఉదయం 11.30 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌ కంప్యూటర్‌ బటన్‌ నొక్కి డబ్బు ఇస్తారు.

    ఎంత డబ్బు ఇస్తారు?
    మొత్తం రూ. 254 కోట్లు విడుదల చేస్తున్నారు?

    లబ్దిదారులు డబ్బు ఎలా పొందాలి?
    ఆల్రెడీ లబ్దిదారుల పేర్లు, మొబైల్ నంబర్లు, బ్యాంక్ అకౌంట్ వివరాలు నమోదై ఉన్నాయి. కాబట్టి డబ్బు రిలీజ్ చెయ్యగానే... లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లలో మనీ డిపాజిట్ అవుతుంది. డిపాజిట్ అయినట్లు వారి మొబైల్‌కి మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత ఏటీఎం కార్డు ద్వారా డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు. లేదా బ్యాంకుకు వెళ్లి తీసుకోవచ్చు. లేదా ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

    ఎవరైనా పేర్లు నమోదు చేసుకోకపోతే?
    అలాంటి వారు గ్రామ లేదా వార్డు సచివాలయ వాలంటీర్‌ను కలిసి విషయం చెప్పాలి. వారి ద్వారా ఈ పేర్ల నమోదు ప్రక్రియను పూర్తి చేయించుకోవాలి. ఆ తర్వాత వారికి కూడా బీమా సొమ్ము చెల్లించేలా ఈ పథకాన్ని రూపొందించారు.

    YSR Bheema Scheme
    వైఎస్ఆర్ బీమా వెబ్‌సైట్


    ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోకూడదా?
    ఆన్‌లైన్‌లో కూడా అప్లై చేసుకోవచ్చు. అందుకు bima.ap.gov.in సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. దానిలో కొన్ని వివరాలు కోరతారు. వాటిని ఫిలప్ చెయ్యాలి. ఈ స్కీం పూర్తి వివరాల్ని అక్కడ మీరు తెలుసుకోవచ్చు.

    ఇది కూడా చదవండి: Horoscope 31-3-2021: నేటి రాశి ఫలాలు... ప్రేమ వ్యవహారాల్లో కొన్ని అవరోధాలు

    లబ్దిదారులైనా డబ్బు రాకపోతే?
    లబ్దిదారులుగా ఉన్న వారికి కచ్చితంగా డబ్బు జమ అవుతుంది. అలా జరగకపోతే... ఈ రోజంతా ఎదురు చూసి... అప్పటికీ రాకపోతే... రేపు గ్రామ, వార్డు వాలంటీర్‌కి విషయం చెప్పాలి. వారి ద్వారా తిరిగి డబ్బు వచ్చేలా చేసుకోవచ్చు. ఏ ఒక్కరికీ డబ్బు మిస్ అవ్వకూడదని ప్రభుత్వం చెప్పింది. అందువల్ల లబ్దిదారులంతా ఈ ప్రయోజనాన్ని తప్పక పొందాలి.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, YSR Bhima Scheme

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు