AP YSR Bheema Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లబ్దిదారులకు నిధులను పక్కాగా పంపిణీ చేసే విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు. తాజాగా వైఎస్ఆర్ బీమా పథకం అమలులో భాగంగా లబ్దిదారులకు ముఖ్యంమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిధులు విడుదల చేశారు. ఉదయం 11.30 గంటలకు సీఎం వైఎస్ జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి డబ్బు పంపిణీ చేశారు. ఆ డబ్బు లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లలోకి నేరుగా జమ అవుతుంది. మధ్యలో ఎవరూ అడ్డుకునే ఛాన్సే లేదు. అందువల్ల అడ్డంగా లంచాలు నొక్కేసే మధ్యవర్తులు ఎవరూ లేరు. ఎవరినీ డబ్బు కోసం బతిమలాడుకోవాల్సిన పని లేదు. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగి ఇబ్బంది పడాల్సిన పనిలేదు. ఏవైనా అనుకోని విపత్తుల వలన కుటంబ సభ్యులు ఇంటి పెద్దను కోల్పోతే... అలాంటి వారిని ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఆదుకుంటోంది. ఈ స్కీం కింద 12,039 కుటుంబాలకు లబ్ది అందిస్తోంది సర్కార్.
ఈ పథకం 2020 అక్టోబర్ 21న ప్రారంభమైంది. ఇప్పటివరకూ వివిధ కారణాలతో 12,039 మంది మరణించగా... వారి కుటుంబ సభ్యులకు లబ్ది లభిస్తోంది. అత్యంత జాగ్రత్తగా లబ్దిదారులను ఎంపిక చేస్తున్న ప్రభుత్వం... వారికి నిధులు చేరేలా పూర్తి బాధ్యతలు తీసుకుంటోంది. నేడు డబ్బు డిపాజిట్ అయినట్లు లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లో రిజిస్టర్ అయిన మొబైల్‌కి మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత ఏటీఎం కార్డు ద్వారా డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు. లేదా బ్యాంకుకు వెళ్లి తీసుకోవచ్చు. లేదా ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
ఎవరైనా పేర్లు నమోదు చేసుకోకపోతే... అలాంటి వారు గ్రామ లేదా వార్డు సచివాలయ వాలంటీర్‌ను కలిసి విషయం చెప్పాలి. వారి ద్వారా ఈ పేర్ల నమోదు ప్రక్రియను పూర్తి చేయించుకోవాలి. ఆ తర్వాత వారికి కూడా బీమా సొమ్ము చెల్లించేలా ఈ పథకాన్ని రూపొందించారు. లేదంటే... ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. అందుకు bima.ap.gov.in సైట్లోకి వెళ్లాలి. అక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. దానిలో కొన్ని వివరాలు కోరతారు. వాటిని ఫిలప్ చెయ్యాలి. ఈ స్కీం పూర్తి వివరాల్ని అక్కడ మీరు తెలుసుకోవచ్చు.
లబ్దిదారులుగా ఉన్న వారికి కచ్చితంగా డబ్బు జమ అవుతుంది. అలా జరగకపోతే... ఈ రోజంతా ఎదురు చూసి... అప్పటికీ రాకపోతే... రేపు గ్రామ, వార్డు వాలంటీర్‌కి విషయం చెప్పాలి. వారి ద్వారా తిరిగి డబ్బు వచ్చేలా చేసుకోవచ్చు. లేదంటే టోల్ ఫ్రీ నంబర్‌కి కాల్ చేసి కూడా కంప్లైంట్ ఇవ్వొచ్చు. ఏ ఒక్కరికీ డబ్బు మిస్ అవ్వకూడదని ప్రభుత్వం చెప్పింది. అందువల్ల లబ్దిదారులంతా ఈ ప్రయోజనాన్ని తప్పక పొందాలి.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.