ఆరోగ్యశ్రీ పరిధిలోకి 2 వేల రకాల వ్యాధులు...వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ప్రారంభం...

సంపాదించే వ్యక్తి అనారోగ్యం పాలైతే, శస్త్ర చికిత్స తర్వాత ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బంది ఎదుర్కోకుండా ‘వైయస్సార్‌ ఆరోగ్య ఆసరా’ పథకాన్ని ఆరోగ్యశ్రీలో భాగంగా ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. శస్త్రచికిత్స తర్వాత రోగికి విశ్రాంతి సమయంలో వైద్యులు సూచించినంత కాలం రోజుకు రూ.225 లేదా నెలకు రూ.5 వేలు ఇస్తామని తెలిపారు.

news18-telugu
Updated: December 2, 2019, 10:47 PM IST
ఆరోగ్యశ్రీ పరిధిలోకి 2 వేల రకాల వ్యాధులు...వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ప్రారంభం...
సీఎం జగన్
  • Share this:
‘ఆరోగ్యశ్రీ’ పరిధిలోకి 2 వేల రకాల వ్యాధులను తీసుకువచ్చి పథకం ద్వారా అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. వచ్చే జనవరి 1 నుంచి క్యాన్సర్‌ రోగులకూ పథకంలో పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందిస్తామని, ఎంత ఖర్చైనా ప్రభుత్వం భరిస్తుందని ఆయన ప్రకటించారు. సంపాదించే వ్యక్తి అనారోగ్యం పాలైతే, శస్త్ర చికిత్స తర్వాత ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బంది ఎదుర్కోకుండా ‘వైయస్సార్‌ ఆరోగ్య ఆసరా’ పథకాన్ని ఆరోగ్యశ్రీలో భాగంగా ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. శస్త్రచికిత్స తర్వాత రోగికి విశ్రాంతి సమయంలో వైద్యులు సూచించినంత కాలం రోజుకు రూ.225 లేదా నెలకు రూ.5 వేలు ఇస్తామని తెలిపారు. ఈ పథకం ద్వారా ఏటా 4.5 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని, ఇందుకోసం రూ.300 కోట్ల వ్యయం కానందని చెప్పారు.  వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి కొత్తగా 1060 అంబులెన్సులు కొనుగోలు చేసి 108, 104 సర్వీసుల ద్వారా మెరుగైన సేవలు అందిస్తామని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ వెల్లడించారు.

అంతే కాకుండా అదే సమయానికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రమాణాలతో అన్ని ఔషధాలు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు కూడా గ్రేడింగ్‌ ఇస్తామని, గ్రేడ్‌–ఏ లేకుంటే అక్కడ ఆరోగ్యశ్రీని అనుమతించబోమని ప్రకటించారు. రాష్ట్రంలో కొత్తగా ఏడు చోట్ల ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చెప్పారు.

ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా పేద రోగులకు ఊరట కల్పించే ‘వైయస్సార్‌ ఆరోగ్య ఆసరా’ను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఆరోగ్యశ్రీలో వైద్యం పొందిన రోగులకు చెక్కులు అందించిన సీఎం, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రోగులకు ఈ తరహా ఆర్థిక సహాయం చేయడం దేశంలోనే ఇది తొలిసారి. కుటుంబ పెద్ద జబ్బు బారిన పడితే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం దీన్ని అమలు చేస్తోంది.
‘వైయస్సార్‌ ఆరోగ్య ఆసరా’ ద్వారా ఏటా 4.5 లక్షల మంది లబ్ధి పొందనుండగా, ఇందుకోసం రూ.300 కోట్లు వ్యయం కానుంది. శస్త్ర చికిత్స అనంతరం రోగులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన 48 గంటల్లోనే ఈ మొత్తం వారి ఖాతాల్లో జమ అవుతుంది

. 26 ప్రత్యేక విభాగాల్లో 836 రకాల శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి ‘వైయస్సార్‌ ఆరోగ్య ఆసరా’ వర్తించనుంది. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.  గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు చెక్కులు పంపిణీ చేసిన అనంతరం గుంటూరు వైద్య కళాశాల, జింఖానా ఆడిటోరియమ్‌ చేరుకున్న సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ అక్కడ సభలో పాల్గొన్నారు.

 
First published: December 2, 2019, 10:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading