హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో ట్విస్ట్.. వారి పేర్లు చెప్పాలని బలవంతం చేస్తున్నారంటూ ఫిర్యాదు

YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో ట్విస్ట్.. వారి పేర్లు చెప్పాలని బలవంతం చేస్తున్నారంటూ ఫిర్యాదు

వైఎస్ వివేకా కేసులో మరో ట్విస్ట్

వైఎస్ వివేకా కేసులో మరో ట్విస్ట్

YS Viveka Murder Case update: సీఎం బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో ట్విస్టులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజా ఈ కేసులో కొందరి పేర్లు చెప్పాలని బలవంతంగా బెదిరిస్తున్నారంటూ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసు మరో మలుపు తిరిగేలా ఉంది.

ఇంకా చదవండి ...

YS Vivekananda Reddy Murder Case  Update: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy Murder Case) రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది.  కడప (Kadapa), అనంతపురం (Anatapuram) పోలీసులు తనను వేదిస్తున్నారంటు గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి అనంతపురము ఎస్పీ ఫక్కీరప్ప కలిసి ఫిర్యాదు చేశాడు. ఈ రోజు జరిగిన స్పందన కార్యక్రమంలో గంగాధరరెడ్డి ఎస్పీని కలిసి వేధింపుల గురించి వివరించాడు. మరోవైపు వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (YS Avinash Reddy) సన్నిహితుడు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వైఎస్ వివేకా డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సీబీఐ శంకర్ రెడ్డిని అదుపులోకి తీసుకుంది. శంకర్ రెడ్డిని అరెస్ట్ చేయసిన తర్వాత ఆయన కుమారుడు చైతన్య రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. వివేకా హత్యతో తన తండ్రికి ఎలాంటి సంబంధం లేదని.. కేసులో మతకు న్యాయం చేయాలని లేఖలో కోరారు. ఈనెల 15న ఆయన భుజానికి శస్త్రచికిత్స జరిగిందని.. ఆయన పనులు ఆయన చేసుకోలేకపోతున్నారని పేర్కొన్నారు.

కేసు త్వరగా కొలిక్కి వస్తోంది అనుకుంటున్న సమయంలో.. మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.  కొత్తగా గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి తెరపైకి వచ్చాడు. వైఎస్ అవినాష్ రెడ్డి తో పాటు మరికొందరిని ఈ కేసులో ఇరికించేలా తనపై ఒత్తిడి తెస్తున్నారని అనంతపురం జిల్లా యాడికికి చెందిన గంగాధర్ రెడ్డి జిల్లా ఎస్పీ ఫక్కీరప్పకు ఫిర్యాదు చేశారు. వైయస్ వివేకా కూతురు సునీతతో పాటు మరికొందరు అనుచరులు తనను బెదిరిస్తున్నారని గంగాధర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. గతంలో కూడా సీబీఐ అధికారులు, ప్రస్తుత సిఐ శ్రీరామ్ తనను తీవ్రంగా వేధించారని గంగాధర్ రెడ్డి ఆరోపిస్తున్నారు.

ఇదీ చదవండి : అహోబిలంలో రోడ్డు ప్రమాదం.. లోయలోపడ్డ ఆర్టీసీ బస్సు.. 10మంది తీవ్రగాయాలు

ఏది ఏమైనా.. వైయస్ వివేకా హత్య కేసులో రోజుకో మలుపు. గంటకో వార్త సంచలనం రేకెత్తిస్తోంది. గంగాధర రెడ్డి వ్యాఖ్యలు సంచలన రేపుతున్నాయి. బెదిరింపులకు తాను ఒప్పుకోకపోవడంతో.. డబ్బు కూడా ఇస్తామని చెప్పారని అంటున్నారు గంగాధర్ రెడ్డి. ఇప్పుడు ఏకంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. తనతో పాటు కుటుంబ సభ్యులకు ప్రాణ రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.


ఇదీ చదవండి : ఒమిక్రాన్ తరుముకొస్తోంది.. నిర్లక్ష్యం వద్దు మిత్రమా.. మాస్క్ మస్ట్ అని గుర్తించండి..

గంగాధర రెడ్డి వ్యాఖ్యలతో కేసు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.  వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన డ్రైవర్ దస్తగిరి.. హత్య చేస్తే శివశంకర్ రెడ్డి రూ.40కోట్లు ఇస్తారని.. అందులో రూ.5 కోట్లు తనకు ఇస్తామని చెప్పినట్లు సీబీఐకి వాంగ్మూలం ఇచ్చాడు. అలాగే ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, డి.శంకర్ రెడ్డి వంటి పెద్దవాళ్లు ఏమీ జరగకుండా చూసుకుంటారని ఎర్రగంగిరెడ్డి చెప్పినట్లో దస్తగిరి పేర్కొన్నాడు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Andhra Pradesh, AP News

ఉత్తమ కథలు