హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

వైఎస్ వివేకానందరెడ్డిని వాళ్లే చంపారా..? ముగ్గురిపై పోలీసుల అనుమానాలు...

వైఎస్ వివేకానందరెడ్డిని వాళ్లే చంపారా..? ముగ్గురిపై పోలీసుల అనుమానాలు...

వైఎస్ వివేకానంద రెడ్డి

వైఎస్ వివేకానంద రెడ్డి

YS Vivekananda Reddy Murder Case : కాల్ డేటా ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు... మూడు టీములుగా విడిపోయి డేటా మొత్తాన్నీ విశ్లేషిస్తున్నారు. తద్వారా కిరాయి హంతకులే వైఎస్‌ను చంపి ఉంటారనే కోణం తెరపైకి వస్తోంది.

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని కిరాయి హంతకులే చంపారా? రకరకాలుగా హింసించి, అత్యంత హీనంగా ప్రాణాలు తీశారా? ఇందుకోసం భారీ డీల్ కుదిరిందా? అనే ప్రశ్నలకు సమాధానం వెతుకుతున్నారు సిట్ అధికారులు. వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించిన కాల్ డేటాను పరిశీలిస్తున్న పోలీసులకు... వివేకా కుటుంబంలోని ముగ్గురిపై అనుమానాలు కలుగుతున్నాయి. మూడు ప్రత్యేక టెక్నికల్ టీమ్స్ కాల్ డేటాను విశ్లేషిస్తుంటే, ఆ డేటాలో పేర్లు ఉన్న ముగ్గురు మాత్రం పోలీసులకు సహకరించట్లేదు. ఆ కాల్ డేటా ఆధారంగా... ఎవరెవరు ఏం మాట్లాడారో తెలుసుకుంటున్న పోలీసులు... దానిపై ప్రశ్నిస్తుంటే సరైన సమాధానం చెప్పట్లేదట వాళ్లు. అందుకే ఆ ముగ్గురిపైనా పోలీసులకు అనుమానాలు కలుగుతున్నాయి.


ఈ ఏడాది మార్చి 15న వివేకాను ఆయన ఇంట్లోనే ఎవరో చంపేశారు. తెల్లారేసరికి దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ప్రొఫెషనల్‌ కిల్లర్స్‌ ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. కుటుంబ వ్యవహారాలే హత్యకు దారి తీసి ఉంటాయని అనుకుంటున్నారు. ఇప్పుడా బెంగళూరు హంతకుల కోసం వేటాడుతున్నారు. సమస్యేంటంటే వివేకా కుటుంబానికి చెందిన ఆ ముగ్గురినీ కష్టడీలోకి తీసుకొని ప్రశ్నించడం కుదరట్లేదని భావిస్తున్న పోలీసులు... కాల్ డేటా ద్వారా నిజాలు బయటకు వస్తాయనే ఉద్దేశంతో దాన్ని పరిశీలిస్తున్నారు. వివేకా, ఆయన అనుచ రులు, సన్నిహితులు, కుటుంబ సభ్యుల ఫోన్‌ కాల్‌ డేటాను సేకరించారు. వివేకా హత్య కోసం ఆ ప్రొఫెషనల్ కిల్లర్లకు భారీగా డబ్బు ఇచ్చి డీల్ కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఆ ముఠా దొరికితే, పోలీసుల అనుమానాలు నిజమైతే, కుటుంబ సభ్యుల్ని కస్టడీలోకి తీసుకునే అవకాశాలుంటాయని తెలుస్తోంది.


వివేకా హత్య తర్వాత సాక్ష్యాల్ని తారుమారు చేశారంటూ గంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, వంట మనిషి కొడుకు ప్రకాశ్‌లను మార్చి 28న పులివెందుల డీఎస్పీ నాగరాజు అరెస్టు చేసి రిమాండుకు పంపారు. ఘటనా స్థలంలో కొన్ని వెంట్రుకలు, మరికొన్ని వస్తువులు సేకరించినట్లు రిమాండ్ రిపోర్టులో రాశారు. హత్య జరిగిన తీరు పరిశీలించినప్పుడు ఇది ప్రొఫెషనల్‌ కిల్లర్స్‌ తప్ప మరెవరూ చేసి ఉండరని డీఎస్పీ అప్పుడే అనుమానించారు. అదే విషయాన్ని రిమాండ్‌ రిపోర్టులో రాశారు. సో ఇప్పుడు కుటుంబ సభ్యులు వాస్తవాలు చెబితే మర్డర్ మిస్టరీ వీడుతుందన్నట్లు మాట్లాడుతున్నారు పోలీసులు. అందువల్ల ఈ కేసు మిస్టరీ వీడేందుకు మరికొంత సమయం పట్టేలా ఉంది.


 


ఇవి కూడా చదవండి :


టీడీపీ, వైసీపీ... రెండు పార్టీలకూ 100కు పైనే... నకిలీ సర్వేలపై ప్రజల ఆగ్రహం...


రామోజీరావుతో చంద్రబాబు భేటీ... ఏం చర్చించారంటే...


అండమాన్‌కి వస్తున్న నైరుతీ రుతుపవనాలు... తెలుగు రాష్ట్రాలకు మాత్రం ఆలస్యమే...

First published:

Tags: Andhra Pradesh, Case, Murder, Police, YS Vivekananda reddy

ఉత్తమ కథలు