వివేకా హత్య కేసులో సంచలన ట్విస్ట్.. వైసీపీ ఎంపీ, మాజీ మంత్రి పేర్లు

ప్రత్యేకమైన ఆరోపణలేవీ చేయడంలేదంటూనే కొందరిపై అనుమానాలున్నాయని ఓ జాబితాను హైకోర్టుకు సమర్పించారు. ఆ జాబితాలో వైసీపీ ఎంపీతో పాటు టీడీపీ మాజీ మంత్రి ప్రస్తుతం బీజేపీ నేత పేర్లు ఉండడం చర్చనీయాంశమైంది.


Updated: January 28, 2020, 8:46 PM IST
వివేకా హత్య కేసులో సంచలన ట్విస్ట్.. వైసీపీ ఎంపీ, మాజీ మంత్రి పేర్లు
వైఎస్ వివేకా
  • Share this:
ఏపీలో సంచలనం రేపిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఇప్పటికే పలువురు హైకోర్టును ఆశ్రయించగా.. తాజాగా వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత సైతం కోర్టులో పిటిషన్ వేశారు. వివేకా హత్యకేసులో కొందరిపై అనుమానాలున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు సునీత. ప్రత్యేకమైన ఆరోపణలేవీ చేయడంలేదంటూనే కొందరిపై అనుమానాలున్నాయని ఓ జాబితాను హైకోర్టుకు సమర్పించారు. ఆ జాబితాలో వైసీపీ ఎంపీ అవినాష్‌తో పాటు టీడీపీ మాజీ మంత్రి ప్రస్తుతం బీజేపీ నేత ఆది నారాయణరెడ్డి పేర్లు ఉండడం చర్చనీయాంశమైంది. హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఇప్పటికే వివేకా భార్య సౌభాగ్యమ్మ, అప్పటి ప్రతిపక్షనేత జగన్, టీడీపీ నేత బీటెక్ రవి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి వేర్వేరుగా పిటిషన్లు వేశారు. ఈ క్రమంలో ఈ వ్యాజ్యాలన్నీ మిగతా వాటితో కలిపి విచారిస్తామని హైకోర్టు తెలిపింది. వీటిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మరోవైపు కేసు విచారణపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హత్య కేసు సీబీఐకి అప్పగించాలంటూ పిటిషన్లు వేసిన వారిలో ప్రస్తుతం సీఎం జగన్ కూడా ఉన్నారని.. అలాంటప్పుడు కేసు సీబీఐకి అప్పగించేందుకు అభ్యంతరమేంటని ప్రశ్నించింది. ఐతే దీనిపై సమాధానం చెప్పేందుకు అడ్వొకేట్ జనరల్ అందుబాటులో లేకపోవడంతో కేసు విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. ఐతే సిట్ విచారణ తుది దశలో ఉన్నందున.. సీబీఐకి అప్పగించాల్సిన అవసరం లేదని గతంలోనే ఏజీ హైకోర్టుకు తెలిపారు.

హైకోర్టుకు సునీత సమర్పించిన అనుమానితుల జాబితా:

రంగయ్య, వాచ్‌మెన్
ఎర్ర గంగిరెడ్డి, వివేకా సన్నిహితుడు
వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైసీపీ ఎంపీ
వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి తండ్రివైఎస్‌ మనోహర్‌రెడ్డి
ఉదయ్‌కుమార్‌రెడ్డి
శివశంకర్‌రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి
పరమేశ్వర్‌రెడ్డి
శ్రీనివాసరెడ్డి
సీఐ శంకరయ్య
ఏఎస్‌ఐ రామకృష్ణారెడ్డి
ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి
మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి
మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి

అనుమానితుల జాబితా
Published by: Shiva Kumar Addula
First published: January 28, 2020, 8:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading