ఏపీ (Andhra Pradesh)లో సంచలనం రేపిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Vivekanandareddy Murder Case) కీలక మలుపుతిరిగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. శనివారం పులివెందుల కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరైన తులసమ్మ తన వాంగ్మూలమిచ్చారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ (CBI) విచారణ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురిని విచారించారు. ఐతే ఫిబ్రవరి 21న పులివెందుల కోర్టులో తులసమ్మ పిటిషన్ వేశారు. ఈ కేసులో మరో ఆరుగురుని సీబీఐ విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. వైఎస్ వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి, బీటెక్ రవి, వివేకా బావమరిది శివప్రకాశ్ రెడ్డి, నీరుగుట్టు ప్రసాద్, కొమ్మ పరమేశ్వర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డిలను కూడా ప్రశ్నించాలని విజ్ఞప్తి చేశారు. ఈ హత్యలో వారి ప్రమేయం ఉందని ఆరోపించారు. తులసమ్మ పిటిషన్ వేసిన 9 నెలల తర్వాత పులివెందుల కోర్టు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసింది.
గిరిజన రైతులకు అలర్ట్.. రూ.2కే కాఫీ పల్పింగ్.. ఎవరిని సంప్రదించాలంటే
వివేకానందరెడ్డి షేక్ షమీమ్‌ను రెండో పెళ్లి చేసుకున్న తర్వాత.. వారి కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని తులసమ్మ ఆరోపించారు. వైఎస్ వివేకాను వదిలిపెట్టాలని.. షమీమ్‌ను ఆయన భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత బెదిరించారని చెప్పారు. షమీమ్‌కు జన్మించిన కుమారుడినే తన చట్టబద్ధమైన వారసుడిగా ప్రకటిస్తానని వైఎస్ వివేకానంద రెడ్డి.. తన బంధువులు, స్నేహితులకు చెప్పడంతో.. ఆ వివాదం మరింత ముదిరిందని పేర్కొన్నారు. ఆయనకు, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సంబంధాలు పూర్తిగా క్షీణించాయని తెలిపారు. వివేకానంద ఆస్తికి వారసులు కావాలని ఆయన అల్లుడు రాజశేఖర్, శివప్రకాశ్ ఆశించారని.. కానీ షమీమ్ కుమారుడికి ఆస్తి రాసిస్తానని చెప్పడంతో.. వివేకాపై వారు పగ పెంచుకున్నారని తులసమ్మ తన పిటిషన్లో పేర్కొన్నారు.
అంతేకాదు పులివెందులకు చెందిన పరమేశ్వర రెడ్డికి వివేకానందతో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని తులసమ్మ ఆరోపించారు. బెంగళూరులో భూ ఒప్పందం ద్వారా వచ్చిన సొమ్ములో తనకు వాటా ఇవ్వనందుకు వివేకానందపై ఆయన కూడా పగ పెంచుకున్నాడని తెలిపారు. వివేకా కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు పులివెందులకు చెందిన ఎన్ ప్రసాద్‌ను ఇతర నిందితులు మోహరించినట్లు వెల్లడించారు. ఎం రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బిటెక్ రవి, అనంతపురంకు చెందిన వైజీ రాజేశ్వర రెడ్డిలకు వివేకానంద రెడ్డితో రాజకీయ విభేదాలు ఉన్నాయని తులసమ్మ ఆరోపించారు. ప్రత్యర్థిని వైసీపీ గూటికి తీసుకురావాలని ప్రయత్నించడంతో వివేకానందరెడ్డిపై వైజీ రాజేశ్వర రెడ్డి పగ పెంచుకున్నారని తెలిపారు.
సీబీఐ దర్యాప్తు పూర్తిగా లోపభూయిష్టంగా, పక్షపాతంగా, అన్యాయంగా ఉందని తులసమ్మ ఆరోపించారు. హత్యలో నిజమైన నిందితులను రక్షించేందుకు సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాని చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, CBI, Ys viveka murder case, YS Vivekananda reddy