MP Avinash Reddy: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సంచనలంగా మారిన వైఎస్ వివేకానంద హత్య మిస్టరీ ఇంకా వీడడం లేదు. కానీ ఆయన కూతరు మాత్రం.. వైసీపీ కీలక నేతలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజాMP Avinash Reddy: ఆంధ్రప్రదేశ్ లో పెను సంచలనంగా మారింది మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు.. అయితే ఏళ్లు గడుస్తున్నా హత్య మిస్టరీ వీడడం లేదు.. ఇక ఈ ఘటన డైలీ సిరియల్ ను మించి సాగుతోంది. ముఖ్యంగా ఈ వ్యవహారంలో రాజకీయ విమర్శల పర్వం కొనసాగుతోంది. విపక్షాలన్నీ ఈ హత్యలో వైసీపీ కీలక నేతల హస్తం ఉందని విమర్శలు చేస్తున్నారు. టీడీపీ అయితే సీఎం జగన్ నే ప్రధాన దోషి అని ఆరోపిస్తోంది. సీబీఐ అధికారులు మాత్రం ఈ కేసు కొలిక్కి వచ్చింది అంటున్నారు. ఇప్పటికే ఛార్జ్ షీట్ నమోదుకూడా చేశారు. తాజాగా వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి సీబీఐ వాంగ్మూలంలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అక్కడితోనే ఆగని ఆమె.. ఈ వ్యవహాంపై లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాశారు.. వివేకా హత్య కేసులో ఎంపీ ఆవినాష్ రెడ్డి హస్తం ఉందని లేఖలో స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కూతురు సునీతారెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలోని కీలక అంశాలను బయటపెట్టారు. తన నాన్నను ఎవరు చంపారో అందరికీ తెలుసన్న ఆమె.. తన తండ్రి హత్యపై వైఎస్ జగన్, వైఎస్ భారతి చాలా తేలిగ్గా స్పందించారని.. ఈ హత్య విషయంలో జగనన్న వ్యాఖ్యలు బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు.. హత్య గురించి అనుమానితుల పేర్లను జగనన్నకు చెబితే.. వాళ్లను ఎందుకు అనుమానిస్తున్నావు.. నీ భర్తే హత్య చేయించాడేమో అని అన్యాయంగా మాట్లాడారని.. కేసు సీబీఐకి అప్పగిస్తే అవినాష్‌కు ఏమీకాదు.. బీజేపీలో చేరతాడని చెప్పారని.. ఇప్పటికే తమపై 11 కేసులున్నాయి.. మీది 12వది అవుతుందన్నారని ఆమె సంచలన విషయాలు చెప్పారు.
తన తండ్రి హత్యను వైఎస్ జగన్ రాజకీయ సానుభూతి కోసం వాడుకున్నారని సీబీఐకి తెలిపిన ఆమె.. సీబీఐ విచారణ కోసం తాను కోర్టుకు వెళ్తే జగన్ రాజకీయ భవిష్యత్తు.. నాశనమయ్యే ప్రమాదం ఉందని వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారని పేర్కొన్నారు.. అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డిల డైరెక్షన్లో ఆధారాలను మాయం చేశారని ఆరోపించారు.. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డిలతో పాటు మరికొందరు అనుమానితులను విచారిస్తే నిజాలు బయటపడతాయని సీబీఐకి తెలిపారు. తన తండ్రి అంటే ఎంపీ అవినాష్‌కు గిట్టదన్నారు. హంతకులకు శిక్ష పడాలని.. గత్యంతరం లేక సీబీఐని ఆశ్రయించానంటూ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో సునీతా రెడ్డి పేర్కొన్నారు. గా లోక్ సభ స్పీకర్ కు ఆమె లేఖ రాయడం సంచలనంగా మారింది. హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి హస్తం ఉందంటూ ఆమె ఆరోపించారు.
MP Avinash Reddy: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పెను సంచలనంగా మారింది మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసు (Murder Case).. అయితే ఏళ్లు గడుస్తున్నా హత్య మిస్టరీ వీడడం లేదు.. ఇక ఈ ఘటన డైలీ సిరియల్ ను మించి సాగుతోంది. ముఖ్యంగా ఈ వ్యవహారంలో రాజకీయ విమర్శల పర్వం కొనసాగుతోంది. విపక్షాలన్నీ ఈ హత్యలో వైసీపీ కీలక నేతల హస్తం ఉందని విమర్శలు చేస్తున్నారు. టీడీపీ (TDP) అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) నే ప్రధాన దోషి అని ఆరోపిస్తోంది. సీబీఐ అధికారులు మాత్రం ఈ కేసు కొలిక్కి వచ్చింది అంటున్నారు. ఇప్పటికే ఛార్జ్ షీట్ నమోదుకూడా చేశారు. తాజాగా వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి (YS Sunitha Reddy) సీబీఐ వాంగ్మూలంలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అక్కడితోనే ఆగని ఆమె.. ఈ వ్యవహాంపై లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాశారు.. వివేకా హత్య కేసులో ఎంపీ ఆవినాష్ రెడ్డి హస్తం ఉందని లేఖలో స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కూతురు సునీతారెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలోని కీలక అంశాలను బయటపెట్టారు. తన నాన్నను ఎవరు చంపారో అందరికీ తెలుసన్న ఆమె.. తన తండ్రి హత్యపై వైఎస్ జగన్, వైఎస్ భారతి చాలా తేలిగ్గా స్పందించారని.. ఈ హత్య విషయంలో జగనన్న వ్యాఖ్యలు బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు.. హత్య గురించి అనుమానితుల పేర్లను జగనన్నకు చెబితే.. వాళ్లను ఎందుకు అనుమానిస్తున్నావు.. నీ భర్తే హత్య చేయించాడేమో అని అన్యాయంగా మాట్లాడారని.. కేసు సీబీఐకి అప్పగిస్తే అవినాష్‌కు ఏమీకాదు.. బీజేపీలో చేరతాడని చెప్పారని.. ఇప్పటికే తమపై 11 కేసులున్నాయి.. మీది 12వది అవుతుందన్నారని ఆమె సంచలన విషయాలు చెప్పారు.
తన తండ్రి హత్యను వైఎస్ జగన్ రాజకీయ సానుభూతి కోసం వాడుకున్నారని సీబీఐకి తెలిపిన ఆమె.. సీబీఐ విచారణ కోసం తాను కోర్టుకు వెళ్తే జగన్ రాజకీయ భవిష్యత్తు.. నాశనమయ్యే ప్రమాదం ఉందని వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారని పేర్కొన్నారు.. అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డిల డైరెక్షన్లో ఆధారాలను మాయం చేశారని ఆరోపించారు.. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డిలతో పాటు మరికొందరు అనుమానితులను విచారిస్తే నిజాలు బయటపడతాయని సీబీఐకి తెలిపారు. తన తండ్రి అంటే ఎంపీ అవినాష్‌కు గిట్టదన్నారు. హంతకులకు శిక్ష పడాలని.. గత్యంతరం లేక సీబీఐని ఆశ్రయించానంటూ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో సునీతా రెడ్డి పేర్కొన్నారు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.