Ys Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తు అధికారిని మార్చాలని ఇటీవల చెప్పిన కోర్టు తాజాగా మరిన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని సీబీఐని సుప్రీం ఆదేశించింది. ఈ కేసులో కుట్ర కోణాన్ని అత్యంత వేగంగా బయటపెట్టాలని పేర్కొంది. అలాగే 6 నెలల్లో కోర్టు ట్రయిల్ ప్రారంభించాలి. లేదంటే నిందితుల రెగ్యులర్ బెయిల్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. సీబీఐ దాఖలు చేసిన నివేదికను పరిగణలోకి తీసుకుంటాం అని తెలిపింది.
ఈ క్రమంలో దర్యాప్తును ఏప్రిల్ 30లోపు పూర్తి చేస్తామని స్పష్టం చేసింది. అలాగే అదనపు ఛార్జ్ షీట్ ను ఏర్పాటు చేస్తామని తెలిపింది. కోర్టు ఆదేశాలతో ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ కేసులో నిందితునిగా ఉన్న శివశంకర్ భార్య తులసమ్మ దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. ఈ విచారణలో భాగంగా సీబీఐ దర్యాప్తుపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసు దర్యాప్తులో విచారణ అధికారిని మార్చాలని లేదా మరో అధికారిని నియమించాలని గత విచారణలో ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తును కొనసాగిస్తున్న రామ్ సింగ్ ను కొనసాగుతున్నట్లు సీబీఐ పేర్కొంది.
వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తుపై సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డికి అలాగే అతని తండ్రి భాస్కర్ కు సీబీఐ (CBI) నోటీసులు ఇచ్చింది. అంతేకాదు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (Mp Avinash Reddy)ని సీబీఐ పలుమార్లు విచారించి మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో సీబీఐ (CBI) విచారణపై ఎంపీ అవినాష్ రెడ్డి (Mp Avinash Reddy) తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ విచారణ సందర్బంగా ఆడియో, వీడియో రికార్డింగ్ చేసేలా సీబీఐకి (CBI) ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ రెడ్డి రిట్ పిటీషన్ దాఖలు చేశారు. అలాగే న్యాయవాది సమక్షంలోనే సీబీఐ విచారణ జరిగేలా చూడాలని ఈ పిటీషన్ లో పేర్కొన్నారు. అంతేకాదు తనకు 150 సీఆర్పీసీ కింద సీబీఐ (CBI) నోటీసులు ఇచ్చిందని..ఈ నోటీసుల ప్రకారం తనను అరెస్ట్ చేయకూడదని కోర్టు సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టుకు సమర్పించిన పిటీషన్ లో అవినాష్ రెడ్డి (Mp Avinash Reddy) పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే రాబోయే రోజుల్లో ఈ కేసులో అనేక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhrapradesh, Ap, AP News, CBI, Supreme Court, Ys viveka murder case