హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Sharmila: వైఎస్ షర్మిలను పరామర్శించేందుకు జగన్ వస్తున్నారా ?.. విజయమ్మ ఏమన్నారంటే..

YS Sharmila: వైఎస్ షర్మిలను పరామర్శించేందుకు జగన్ వస్తున్నారా ?.. విజయమ్మ ఏమన్నారంటే..

షర్మిల, జగన్ (ఫైల్ ఫోటో)

షర్మిల, జగన్ (ఫైల్ ఫోటో)

YS Sharmila: షర్మిలను పరామర్శిచేందుకు ఆమె అన్న, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్ రాబోతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

నిన్న నర్సంపేటలో పాదయాత్ర చేస్తున్న షర్మిలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు.. ఆమెను హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో విడిచిపెట్టారు. అయితే ఈ రోజు సీఎం కేసీఆర్(CM KCR) ఉండే ప్రగతి భవన్‌కు వెళ్లేందుకు విశ్వప్రయత్నాలు చేసిన వైఎస్ షర్మిలను అడ్డుకునే ప్రక్రియలో హైడ్రామా నడిచింది. ఈ క్రమంలో పోలీసులు షర్మిలను(YS Sharmila) మరోసారి అరెస్ట్ చేశారు. ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో షర్మిలను పరామర్శిచేందుకు ఆమె అన్న, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) హైదరాబాద్ రాబోతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే దీనిపై విజయమ్మ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. షర్మిల కోసం సీఎం జగన్ హైదరాబాద్ రాబోతున్నారా ? అన్న ప్రశ్నకు స్పందించిన విజయమ్మ(YS Vijayamma).. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి, ఆ రాష్ట్రంతో మనకెందుకు అని వ్యాఖ్యానించారు. ఈ రకంగా షర్మిలను పరామర్శించేందుకు సీఎం జగన్ హైదరాబాద్ వస్తున్నారనే ఊహాగానాలకు విజయమ్మ చెక్ చెప్పారు.

షర్మిల అరెస్టుపై ఆమె తల్లి విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన బిడ్డను చూడడానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించొద్దా? పాదయాత్ర చేయకూడదా? అని విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల పాదయాత్ర ప్రారంభిస్తారా అని మీడియా అడగగా ప్రారంభిస్తుందని నేను అనుకుంటానని అన్నారు. ఈ ఘటనపై ఎవరు కూడా ప్రశ్నించకపోవడం బాధ కలిగించిందని అన్నారు.

అంతకుముందు లోటస్ పాండ్ నుండి ప్రగతి భవన్ కు బయలుదేరిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆమె డోర్ తీయకుండా అలాగే ఉండిపోయారు. దీనితొ షర్మిల కారులో ఉండగానే క్రేన్ సాయంతో సోమాజిగూడ నుండి SR నగర్ స్టేషన్ కు తరలించారు. అక్కడ కూడా ఆమె డోర్ తీయకపోవడంతో పోలీసులు లాఠీ సాయంతో కారు డోర్ తీశారు. అనంతరం ఆమెను పీఎస్ లోపలి తీసుకెళ్లారు

ఫ్లాష్..ఫ్లాష్: వైఎస్ షర్మిలకు బిగ్ రిలీఫ్..పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి..కానీ..

Bandi Sanjay: భైంసాను దత్తాత తీసుకుంటాం..బహిరంగ సభలో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

మరోవైపు వైఎస్ షర్మిల పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని పోలీసులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సీఎం కేసీఆర్ , రాజకీయ, మతపరమైన వ్యాఖ్యలు చేయొద్దని హైకోర్టు వ్యాఖ్యానించింది. షర్మిల తన పాదయాత్రలో ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దని సూచిస్తూ పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. Ysrtp పాదయాత్రపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు పాదయాత్రకు మళ్లీ దరఖాస్తు పెట్టుకోవాలని హైకోర్టు సూచించింది.

First published:

Tags: Ap cm ys jagan mohan reddy, YS Sharmila

ఉత్తమ కథలు