వైఎస్ వివేకా హత్య కేసు.. బీజేపీ నేతపై అనుమానం ఉందన్న వైఎస్ విజయమ్మ

వైఎస్ వివేకానంద రెడ్డి (ఫైల్ ఫొటో)

YS Vivekananda reddy murder case: వైఎస్ వివేకా హత్య జరిగిన సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారని.. ఆ తరువాత రెండున్నర నెలల పాటు ఆయనే సీఎంగా ఉన్నారని విజయమ్మ గుర్తు చేశారు.

 • Share this:
  వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో విచారణ సరిగ్గా సాగడం లేదని ఆయన కూతురు సునీత వ్యాఖ్యానించినప్పటి నుంచి ఈ వ్యవహారంలో కొందరు సీఎం జగన్‌ను టార్గెట్ చేస్తున్నారు. సీఎం జగన్‌ తీరుపై అసంతృప్తి కారణంగానే వైఎస్ వివేకా కూతురు ఈ రకమైన వ్యాఖ్యలు చేశారనే ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై దివంగత సీఎం వైఎస్ఆర్ భార్, సీఎం జగన్ తల్లి విజయమ్మ స్పందించారు. కొందరు కావాలనే ఈ అంశంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ వివేకా హత్య జరిగిన సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారని.. ఆ తరువాత రెండున్నర నెలల పాటు ఆయనే సీఎంగా ఉన్నారని విజయమ్మ గుర్తు చేశారు.

  ఈ హత్యకు సంబంధించి గతంలో చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా ఉండి, ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆదినారాయణరెడ్డి పాత్ర మీద అనేక అనుమానాలున్నాయని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోందని.. కాబట్టి ఈ కేసులో నిజానిజాలు నిగ్గు తేల్చాల్సింది కేంద్ర దర్యాప్తు సంస్థ అని విజయమ్మ స్పష్టం చేశారు. ఈ కేసులో దోషులెవరు అనే విషయం తేలాలని.. వారికి శిక్ష పడాలని సునీతతో పాటు తాము కూడా కోరుకుంటున్నట్టు విజయమ్మ తెలిపారు.

  Ap cm ys jagan mohan reddy, ys jagan cabinet ministers, ys jagan cabinet, competition for ys jagan cabinet posts, vijayamma recommendation for ys jagan cabinet post, ys vijayalakshmi, ys rajashekar reddy, minister post for jakkampudi raja, ex minister jakkampudi rammohan rao, ys vijayamma, ys jagan east Godavari cabinet ministers, tdp, chandrababu naidu, ap politics, ap latest news, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ జగన్ కేబినెట్ మంత్రులు, వైఎస్ జగన్ కేబినెట్, వైఎస్ జగన్ కేబినెట్ కోసం పోటీ, వైఎస్ జగన్ కేబినెట్‌లో మంత్రి కోసం విజయమ్మ సిఫార్సు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జక్కంపూడి రాజాకు మంత్రి పదవి, ఏపీ రాజకీయాలు, ఏపీ తాజా వార్తలు
  వైఎస్ విజయమ్మ(ఫైల్ ఫోటో)


  జగన్, షర్మిల మధ్య విభేదాలు ఉన్నాయని వస్తున్న ఊహాగానాలపై కూడా విజయమ్మ స్పందించారు. పొరుగు రాష్ట్రంతో ఇబ్బందులు వద్దనే ఉద్దేశ్యంతో జగన్ తెలంగాణలో వైసీపీ కార్యకలాపాలు వద్దని నిర్ణయించుకున్నారని.. అదే సమయంలో తెలంగాణలో తనకు రాజకీయ భవిష్యత్తు ఉందని షర్మిల భావించినట్టు విజయమ్మ చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని అన్నారు.
  Published by:Kishore Akkaladevi
  First published: