Home /News /andhra-pradesh /

YS JAGANS PLAN TO SELL GOVT LANDS CHALLENGED IN HIGH COURT BA

ఏపీలో ప్రభుత్వ భూముల అమ్మకంపై హైకోర్టులో పిటిషన్...

దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ.. దీనిపై గతంలోనే రిట్ పిటిషన్ దాఖలైనందున పిల్ అవసరం లేదని తెలిపింది. పిల్ వేయడంలో రామకృష్ణారెడ్డి ఆసక్తి ఏంటని హైకోర్టు ప్రశ్నించింది.

దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ.. దీనిపై గతంలోనే రిట్ పిటిషన్ దాఖలైనందున పిల్ అవసరం లేదని తెలిపింది. పిల్ వేయడంలో రామకృష్ణారెడ్డి ఆసక్తి ఏంటని హైకోర్టు ప్రశ్నించింది.

ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నవరత్నాల పథకాల అమలు కోసం ప్రభుత్వ భూములు విక్రయించాలని సర్కారు నిర్ణయించింది.

    ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ భూముల విక్రయాన్ని తప్పుపడుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వ భూముల అమ్మకాన్ని నిరసిస్తూ సామాజిక వేత్త సురేష్ బాబు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మిషన్ బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వ భూములను అమ్ముకునేందుకు ఏపీ సర్కార్ సిద్ధమవుతోందని ఆరోపించడంతోపాటు ఎవరో దాతలు ప్రభుత్వ ప్రయోజనాలకోసం, ప్రజోపయోగం కోసం ఇచ్చిన భూములను ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం చట్టవిరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ భూములను విక్రయించడం సరికాదని పిటిషన్ తరఫు న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు. అయితే ఈ పిటిషన్‌పై విచారణ చేసేందుకు, ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. దీంతో ధర్మాసనం మంగళవారంలోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.... తదుపరి విచారణ ఈనెల 26కు వాయిదా వేసింది.

    ఏపీలో ప్రభుత్వ భూముల విక్రయాలకు సర్కార్ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. బిల్డ్ ఆంధ్రప్రదేశ్ మిషన్ డైరెక్టర్ ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఎన్ బీసీసీ తో కలిసి ప్రభుత్వ భూముల అమ్మకాల ద్వారా సంక్షేమ పథకాలు అమలు, మౌలిక వసతుల కల్పన చేపట్టాలని నిర్ణయించారు. విశాఖలో ఆరు చోట్ల,గుంటూరులో మూడు చోట్ల ఈ ఆక్షన్ ద్వారా అమ్మకాలు చేపట్టనున్నారు. ఈ నెల 29న ఈ ఆక్షన్ ద్వారా వేలం ప్రక్రియ చేపట్టనున్నారు. ఆక్షన్ ద్వారా భూములు కొనుగోలు చేసిన వారు నగదు చెల్లింపు తరువాత భూములపై పూర్తి హక్కులు పొందే అవకాశం ఉంటుంది. ఎలాంటి ఆక్రమణలు,తగాదాలు లేని భూములు వేలం వేస్తున్నట్లు బిల్డ్ ఏపీ ప్రకటించింది.

    మొత్తం 9 భూములను ప్రభుత్వం వేలం వేయనుంది. వాటికి రిజర్వ్ ధరను రూ.208.62 కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. గుంటూరు నగరంలోని నల్లపాడు, శ్రీనగర్ కాలనీల్లో రెసిడెన్షియల్ ప్రాంతాలు, జీటీ రోడ్డులోని కమర్షియల్ ప్రాంతాల్లో భూములు వేలం వేయనున్నారు. విశాఖలోని చినగదిలిలోని రెసిడెన్షియల్ ప్రాంతంలో, అగనంపూడిలో రిక్రియేషన్ భూములను, ఫకీర్ టకియాలో ఉన్న ఎస్‌ఈజెడ్ భూములను వేలం వేలం వేయనున్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP High Court

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు