హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

సీఆర్డీఏపై సీఎం జగన్ ‘మాస్టర్ ప్లాన్’... పేదల ఇళ్ల కోసం..

సీఆర్డీఏపై సీఎం జగన్ ‘మాస్టర్ ప్లాన్’... పేదల ఇళ్ల కోసం..

జగన్

జగన్

అందరికీ ఇళ్ల పథకం అమలు కోసం అవసరమైన పక్షంలో సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్ మార్పులు చేర్పులు చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అందరికీ ఇళ్ల పథకం వర్తింపుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందరికీ ఇళ్ల పథకం అమలు కోసం అవసరమైన పక్షంలో సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్ మార్పులు చేర్పులు చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఆర్డీఏ చట్టం పరిధిలోనే మాస్టర్ ప్లానులో మార్పులుండాలని స్పష్టీకరించింది. రాజధాని పరిధిలో పేదల ఇళ్ల కోసం 1251.51 ఎకరాలను ప్రభుత్వం సిద్దం చేసింది. నవులూరు, కృష్ణాయపాలెం, నిడమర్రు, ఐనవోలు, కురగల్లు, మందడం గ్రామాల్లో అందరికీ ఇళ్ల పథకం భూమిని సిద్దం చేసింది. తాడేపల్లి, మంగళగిరి మున్సిపాల్టీల పరిధిలోని పేదలకు రాజధానిలో ఇళ్ల స్థలాలు కేటాయించారు. తాడేపల్లి, దుగ్గిరాల, మంగళగిరి, పెదకాకాని మండలాల్లోని పలు గ్రామాల్లోని పేదలకు ఇళ్ల కేటాయింపు జరపాలని గతంలోనే నిర్ణయించారు. అయితే, రాజధానిలో ఇళ్ల కేటాయింపుపై జారీ చేసిన జీవో 107ను గతంలో హైకోర్టు రద్దు చేసింది. పేదలకు ఇళ్ల పథకం కోసం గుర్తించిన భూమిని రెవెన్యూ శాఖకు అప్పగించేలా ఉత్తర్వులు ఇచ్చింది.

  దీంతో హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పథకం అమలు చేసేలా ప్రక్రియ ప్రారంభించాలని గుంటూరు, కృష్ణా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు హైకోర్టు తీర్పుపై సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయనున్నట్టు జీవోలో వెల్లడించింది.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Andhra Pradesh, Crda

  ఉత్తమ కథలు