హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

కుమార్తె కోసం సీఎం జగన్ కీలక నిర్ణయం, కరోనా టైమ్‌లో తొలిసారి రాష్ట్రం దాటి

కుమార్తె కోసం సీఎం జగన్ కీలక నిర్ణయం, కరోనా టైమ్‌లో తొలిసారి రాష్ట్రం దాటి

ఏపీ సీఎం జగన్(ఫైల్ ఫోటో)

ఏపీ సీఎం జగన్(ఫైల్ ఫోటో)

YS Jagan daughter Harsha Reddy | ప్రపంచంలోని టాప్ 5 బిజినెస్ స్కూల్స్‌లో ఒకటైన ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు జగన్ కుమార్తె హర్షారెడ్డి పారిస్ వెళ్లనున్నారు.

  YS Jagan daughters | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పెద్ద కుమార్తె హర్షారెడ్డి ప్రపంచ ప్రఖ్యాత ఇన్సీడ్‌ బిజినెస్‌ స్కూల్లో సీటు సాదించారు. దాంతో హర్షారెడ్డి యూనివర్సిటీ లోని పారిస్‌ క్యాంపస్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేయనున్నారు. దానికోసం ఆమె ఈనెల 25న మంగళవారం పారిస్ వెళ్లనున్నారు. తన కుమార్తెను పారిస్‌ పంపించేందుకు మంగళవారం సీఎం జగన్ బెంగుళూరు వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పారిస్‌కు విమానాలు లేనందున, బెంగళూరు నుంచి ఆమెను పారిస్ పంపనున్నారు. ఇంతకు ముందు ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.హర్షారెడ్డి చిన్నప్పటి నుంచి చదువులో చురుకు. ప్రతి పరీక్షల్లోనూ డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణత సాధించారు. ఆమె చదువుకునే సమయంలోనే తాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోవడం, ఆ తర్వాత కాలేజీలో చదువుకునే రోజుల్లో తండ్రి వైఎస్ జగన్ జైలుకు వెళ్లడం లాంటి ఘటనలను ఆమె చూసి కూడా తట్టుకుని చదువు మీద దృష్టికేంద్రీకరించారు.

  వైఎస్ జగన్ సతీమణి భారతి, ఇద్దరు కుమార్తెలు వర్షారెడ్డి , హర్షా రెడ్డి

  లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదివిన హర్షారెడ్డికి కొన్ని రోజుల క్రితం అమెరికాలోని ఓ ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలో ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌గా జాబ్ ఆఫర్ వచ్చినట్టు ప్రచారం జరిగింది. అయితే, ఆమె పారిస్ వెళ్లి ఇన్సీడ్‌లో మాస్టర్స్ చదవాలని నిర్ణయించారు. ప్రపంచంలోని టాప్ 5 బిజినెస్ స్కూల్స్‌లో పారిస్‌లోని ఇన్సీడ్ కూడా ఒకటి. కరోనా తర్వాత పారిస్‌లో క్యాంపస్ ఓపెన్ అయినట్టు సమాచారం రావడంతో ఆమె అక్కడకు వెళ్లనున్నారు. ఈ నెల 25న సీఎం జగన్, భార్య భారతితో కలసి బెంగళూరు వెళ్లనున్నారు. హర్షారెడ్డిని ఫ్లైట్ ఎక్కించిన తర్వాత 26వ తేదీన బెంగళూరులోని తన నివాసంలో ఉంటారు. ఆ తర్వాత తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.

  వైఎస్ జగన్ సతీమణి భారతి, ఇద్దరు కుమార్తెలు హర్షారెడ్డి , వర్షారెడ్డి

  కరోనా వైరస్ సమయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రం దాటి బయటకు వెళ్లడం ఇదే తొలిసారి. గతంలో జూన్ 2న ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవాలని ఆయన అనుకున్నారు. అప్పటి నిమ్మగడ్డ రమేష్ కుమార్, హైకోర్టులో వరుస ఎదురుదెబ్బలు, మూడు రాజధానుల వివాదం నేపథ్యంలో ఆయన అమిత్ షాను కలవాలనుకున్నారు. అయితే, ఆ భేటీ సడన్‌గా వాయిదా పడింది. దీంతో జగన్ పర్యటన రద్దయింది. ఇప్పుడు తన కుమార్తె కోసం జగన్ మోహన్ రెడ్డి కరోనా సమయంలో తొలిసారి రాష్ట్రం దాటనున్నారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Ap cm ys jagan mohan reddy, Ys bharathi

  ఉత్తమ కథలు