ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాపునేస్తం' పథకాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన పేద మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఏడాదికి రూ. 15,000 చొప్పున ఆర్థికసాయం చేసేందుకు ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 2,35,873 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 354 కోట్లు జమచేశారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ క్లిక్ చేయడం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అయ్యింది. ఐదేళ్లలో ప్రభుత్వం మొత్తం రూ.75,000 ఇవ్వనుంది. లబ్ధిదారులు ఇంతే కాదని, అర్హత ఉన్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హతల జాబితా ఉంటుందని, అవి చెక్ చేసుకుని, తాము అర్హులమే అని భావిస్తే తప్పకుండా దరఖాస్తు చేసుకుంటే కాపు నేస్తం జాబితాలో చేరుస్తామని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వం ఎక్కడ కోతలు పెట్టాలా? అని చూస్తే ప్రస్తుతం వైసీపీ పాలనలో ఎంత ఎక్కువ మందికి పథకాన్ని అందజేయాలా? అనే విధంగా చూస్తున్నామని జగన్ చెప్పారు.
‘మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవుడి దయ, మీ చల్లని దీవెనలతో ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేయగలిగాను. ఈ 13 నెలలో కాలంలో 3.98 కోట్ల మందికి దాదాపు రూ.43 వేల కోట్లకు పైగా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఎలాంటి వివక్ష, అవినీతికి తావు లేకుండా బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేశాము. గొప్ప మార్పుతో ఈ 13 నెలల పాలన కొనసాగింది. మనకు ఓటు వేయకపోయినా, అర్హత ఉంటే మంచి జరగాలని ఆరాటపడ్డాం. అవినీతికి తావు లేకుండా పథకాలు అమలు చేశాము. కులం, మతం, రాజకీయాలు, పార్టీలు చూడలేదు. ఇవాళ కాపు అక్కా చెల్లెమ్మలు, అన్నదమ్ములకు ఈ ఏడాది ఎంత ఖర్చు చేశామని చూస్తే.. అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, వాహనమిత్ర, చేదోడు, విదేశీ విద్యా దీవెన, కాపు నేస్తం వంటి పథకాల ద్వారా 23 లక్షలకు పైగా లబ్ధిదారులకు అక్షరాలా రూ.4,770 కోట్లు ఇవ్వడం జరిగింది. బియ్యం కార్డు ఉంటే చాలు 45 నుంచి 60 ఏళ్ల వయసున్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన వారికి ఇప్పుడు రూ.15 వేల చొప్పున సహాయం. ఆ విధంగా 5 ఏళ్లలో మొత్తం రూ.75 వేలు చెల్లింపు. పాత అప్పుల కింద బ్యాంకులు జమ చేసుకోకుండా అన్ ఇన్‌కమ్‌బర్డ్ ఖాతాలో వేస్తున్నాం.’ అని సీఎం వైఎస్ జగన్ చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap cm ys jagan mohan reddy, Navaratnalu, YSR Kapu Nestham, Ysrcp