కాలినడకన తిరుమలకు వైఎస్ జగన్... ఫిబ్రవరి 2 నుంచీ బస్సుయాత్రకు వైపీపీ సన్నాహాలు

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్ జగన్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. పాదయాత్ర ముగించిన ఆయన త్వరలో బస్సు యాత్ర చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల్ని కూడా ప్రకటిస్తారని తెలుస్తోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: January 10, 2019, 2:45 PM IST
కాలినడకన తిరుమలకు వైఎస్ జగన్... ఫిబ్రవరి 2 నుంచీ బస్సుయాత్రకు వైపీపీ సన్నాహాలు
జగన్ (ఫైల్ ఫొటో)
  • Share this:
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ప్రజా సంకల్ప యాత్రను విజయవంతంగా ముగించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... కాలినడకన తిరుమలకు వెళ్తున్నారు. విజయనగరం నుంచి ఉదయం 10 గంటలకు రేణిగుంట రైల్వేస్టేషన్‌కు వెళ్లిన జగన్... ఆ తర్వాత తిరుపతి పద్మావతి గెస్ట్ హౌస్‌ చేరుకున్నారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు బయల్దేరిన జగన్... సామాన్య భక్తుడిలా సర్వదర్శనం క్యూ లైన్లో శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఆ తర్వాత జగన్, శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామిని కలిసి ఆశీస్సులు తీసుకోనున్నారు. రాత్రికి తిరుమలలోనే జగన్ బస చేయనున్నారు. రేపు ఉదయం ఇడుపులపాయకు వెళ్తారని వైసీపీ వర్గాలు తెలిపాయి. అక్కడితో ఒక దశ పూర్తయినట్లుగా ఆ పార్టీ భావిస్తోంది. నెక్ట్స్ ఏం చెయ్యాలి? అసెంబ్లీ ఎన్నికలకు ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపై వైఎస్ జగన్ త్వరలో పార్టీ సీనియర్ నేతలతో చర్చించనున్నారు. ఏడాదికి పైగా పాదయాత్ర చెయ్యడం వల్ల జగన్‌ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటారనీ, సంక్రాంతి పండుగ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్తారని తెలిసింది.

ఫిబ్రవరి 2న జగన్ బస్సు యాత్ర ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బస్సు యాత్ర ఎక్కడి నుంచీ ప్రారంభించినా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జగన్ వ్యూహాలు ఉంటాయని తెలిసింది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలలో పోటీకి అభ్యర్థులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన జగన్‌... బస్సుయాత్రలో వాళ్లను అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వస్తుంది. అప్పటి నుంచీ ప్రభుత్వం కీలకమైన, విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వీలుండదు. ప్రతిదానికీ కోడ్ అడ్డంకిగా మారుతుంది. ఆ సమయంలో... జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు సమస్యల్ని బలంగా లేవనెత్తుతారని తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి:


గుర్గావ్‌లో మరో రేప్ కేసు... అందంగా ఉండటమే ఆమె చేసిన నేరమా?


ఢిల్లీలో దారుణం.. 25 సంవత్సరాల యువతిని చంపి.. సూట్ కేసులో కుక్కారు


రూ.5వేల కోసం స్నేహితుడి మీద హత్యాయత్నం

First published: January 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading