జగన్ మరో సంచలన నిర్ణయం... వాళ్లకు షాక్...

Andhra Pradesh : రాజకీయంగా అవినీతికి బ్రేక్ పెట్టామని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం... అధికారుల్లో అవినీతికి చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది.

news18-telugu
Updated: November 18, 2019, 10:54 AM IST
జగన్ మరో సంచలన నిర్ణయం... వాళ్లకు షాక్...
సీఎం జగన్
  • Share this:
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో అధికారస్వామ్యం (ఉన్నతాధికారులు, అధికారులు, ఉద్యోగులు, ప్రభుత్వ సిబ్బంది)లో అవినీతికి చెక్ పెట్టడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా... IIM అహ్మదాబాద్ నుంచీ కొందరు నిపుణుల్ని ఏపీకి రప్పిస్తోంది. ఈ నిపుణుల బృందం... ఏపీ పాలనలో అసలు అవినీతి మూలాలు ఎక్కడున్నాయి? ఎలా అవినీతి జరుగుతోంది? అధికారుల్లో ఏ స్థాయిలో, ఎంతెంత అవినీతి జరుగుతోంది? దీనికి బ్రేక్ వెయ్యాలంటే ఏం చెయ్యాలి? ఇలాంటి అంశాలపై అధ్యయనం చేసి... ఓ రిపోర్ట్ ఇవ్వనుంది. ఆ రిపోర్ట్ ఆధారంగా... అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రభుత్వం... అధికారుల అవినీతిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా... ఎవరైనా అవినీతికి పాల్పడితే... కచ్చితమైన సాక్ష్యాధారాలు ఉంటే... జైలుశిక్షతోపాటూ... ఉద్యోగం నుంచీ శాశ్వతంగా తప్పించనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పోలీస్ వంటి శాఖల్లో ఎక్కువగా అవినీతి జరుగుతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మిగతా శాఖల్లో కూడా... మంత్రులు అవినీతికి పాల్పడకపోయినా... ఉన్నతాధికారులు, అధికారుల మొదలు... కింది స్థాయి వరకూ అవినీతి జరుగుతోందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లో కరప్షన్ అన్నదే ఉండకూడదన్న ఉద్దేశంతో ఉన్న సర్కార్... అన్ని శాఖలపైనా సమగ్ర నివేదిక తెప్పించుకోనున్నట్లు తెలిసింది.

అవినీతిపై పోరాటంలో భాగంగా... ఏపీ ప్రభుత్వం... ఏసీబీని కూడా బలోపేతం చేయనుంది. ఇందుకు సంబంధించి చట్టంలో సవరణలు చెయ్యనుంది. తద్వారా ఏసీపీ ఇదివరకటి కంటే జోరుగా అవీనితి అక్రమాలపై కొరడా ఝుళిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

Pics : కుందనపు బొమ్మ శ్రేయ ఘోషాల్... క్యూట్ ఫొటోస్
ఇవి కూడా చదవండి :జనసైనికులకు పవన్ కళ్యాణ్ పిలుపు...

షానా చౌహాన్... సక్సెస్‌కి చిరునామా...

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాబ్డే ప్రమాణస్వీకారం...

ఒంటరి యువతిపై రేప్... చికెన్ బిర్యానీ ఇచ్చి...

అయోధ్య తీర్పుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్? నెక్ట్స్ ఏమవుతుంది?
First published: November 18, 2019, 10:51 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading