HOME »NEWS »ANDHRA PRADESH »ys jagan to return to hyderabad today from switzerland and to meet party leaders to discuss present politics nk

నేడు హైదరాబాద్‌కి జగన్... పార్టీ నేతలతో కీలక సమావేశం... ఎన్నికల ఫలితాలపై చర్చ

నేడు హైదరాబాద్‌కి జగన్... పార్టీ నేతలతో కీలక సమావేశం... ఎన్నికల ఫలితాలపై చర్చ
వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ఫైల్ ఫోటో)

AP Elections 2019 : కచ్చితమైన మెజార్టీ వైసీపీకి వస్తే, ఇక ఏ సమస్యా ఉండదనీ, అదే మెజార్టీ రాని పరిస్థితి ఏర్పడితే మాత్రం ఏం చెయ్యాలన్న దానిపై జగన్ కీలక నేతలతో చర్చిస్తారని సమాచారం.

  • Share this:
    సమ్మర్‌లో రిలాక్స్ కోసం ఐదు రోజులు ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి... ఇవాళ తిరిగి హైదరాబాద్ వస్తున్నారు. రాగానే ఆయన పార్టీ నేతలతో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో ఆయన ఏం చర్చిస్తారన్నది ఆసక్తి రేపుతోంది. ప్రధానంగా టీడీపీ టార్గెట్‌గా చర్చ జరుగుతుందని తెలుస్తోంది. ఎన్నికలు ముగిసిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే ఈవీఎంలు, వీవీప్యాట్ల స్లిప్పుల లెక్కింపుపై దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా చేస్తుండటంతో... దాని ప్రభావం పోలింగ్ తేదీన ఓట్ల లెక్కింపుపై ఎంతవరకూ ఉంటుందన్నదానిపై చర్చిస్తారని తెలిసింది. అలాగే... ఏపీలో పూర్తిస్థాయి ఫలితాలు అర్థరాత్రి వరకూ వెలువడే అవకాశాలు లేవని ఏపీ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదీ చెప్పిన అంశంపై లోతుగా చర్చిస్తారని తెలిసింది. అదే విధంగా... స్ట్రాంగ్ రూంల దగ్గర భద్రత అంశంపై చర్చి్స్తూ... మరింత అదనపు సిబ్బందిని నిఘా కోసం నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది.

    ఏపీలో కచ్చితంగా వైసీపీ గెలుస్తుందనీ నమ్ముతున్న జగన్... ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ రోజున వచ్చిన ఫలితాల్ని ఫైనలైజ్ చేసేందుకు ఏం చెయ్యాలన్నది లోతుగా ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఫలితాలు తమకు అనుకూలంగా లేకపోతే టీడీపీ కచ్చితంగా మళ్లీ ఎన్నికలు జరిపించాలని పట్టుబట్టే అవకాశం ఉందనీ, ఈవీఎంలలో మతలబు జరిగిందని లేనిపోని ఆరోపణలు చేసే ప్రమాదం ఉందని భావిస్తున్న వైసీపీ వర్గాలు... ఎట్టి పరిస్థితుల్లో అధికార పార్టీ వ్యూహాలకు చెక్ పెట్టేలా తమ వ్యూహాలు ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ అంశాలన్నింటిపైనా జగన్ తమ పార్టీ నేతలతో చర్చిస్తారని తెలిసింది.



    ఏపీలో హంగ్ రావచ్చనీ, ఫలితాల తర్వాత జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతుండటంతో ఈ అంశాన్ని వైసీపీ ప్రత్యేకంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కచ్చితమైన మెజార్టీ వైసీపీకి వస్తే, ఇక ఏ పార్టీ ఎవరితో కలిసినా ఎలాంటి సమస్యా ఉండదనీ, అదే మెజార్టీ రాని పరిస్థితి ఏర్పడితే మాత్రం ఏం చెయ్యాలన్న దానిపైనా జగన్ కీలక నేతలతో చర్చిస్తారని సమాచారం. ఇక జాతీయ స్థాయి అంశాలకు సంబంధించి... జగన్ ఒకట్రెండు రోజుల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ కాబోతున్నారని తెలిసింది. ఇందులో ప్రధానంగా ఫెడరల్ ఫ్రంట్‌గా ఎలా ముందుకెళ్లాలి అనే అంశంపై చర్చించబోతున్నారని సమాచారం.

    తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ కలిపి రెండు ఫెడరల్‌ ఫ్రంట్‌కు దాదాపు 40 లోక్ సభ స్థానాలు వస్తాయని టీఆర్‌ఎస్‌, వైసీపీ నేతలు ధీమాగా ఉన్నారు. అన్ని సీట్లు రావడం వల్ల కేంద్ర స్థాయిలో చక్రం తిప్పొచ్చనీ, తెలుగు రాష్ట్రాల డిమాండ్లు కలసికట్టుగా సాధించుకోవచ్చని కేసీఆర్, జగన్ నమ్ముతున్నట్లు తెలిసింది. ఐతే... ఇదే భేటీలో తెలంగాణలో ఎలాగైతే కాంగ్రెస్‌ను బలహీనపరిచి... తాము బలపడేందుకు టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోందో, ఏపీలో కూడా టీడీపీని బలహీనపరిచి, వైసీపీ బలపడేందుకు ఏం చేయాలన్న అంశంపైనా చర్చించబోతున్నట్లు తెలుస్తోంది.



    ఇవి కూడా చదవండి :

    ఉత్తరాంధ్రలో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ... ప్రభావం చూపిస్తున్న జనసేన...

    ఏపీ, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో అలర్ట్... ఉగ్రవాద దాడులు జరిగే ప్రమాదం...

    పవన్ కళ్యాణ్ బాటలో నాగబాబు... జబర్దస్త్ విషయంలో ఏమన్నారంటే...

    మాకొద్దీ ఎన్నికల బెట్టింగ్ బాబోయ్... టెన్షన్ తట్టుకోలేకపోతున్న ప్రజలు...
    Published by:Krishna Kumar N
    First published:April 27, 2019, 06:58 IST

    टॉप स्टोरीज