• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • YS JAGAN TIRUPATI TOUR CM TO FACILITATE MAJOR GENERAL C VENU GOPAL WHO PARTICIPATE IN INDO PAK WAR 1971 SK

YS Jagan: నేడు తిరుపతికి సీఎం వైఎస్ జగన్.. మాజీ సైనికులకు సన్మానం

YS Jagan: నేడు తిరుపతికి సీఎం వైఎస్ జగన్.. మాజీ సైనికులకు సన్మానం

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి

భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన 50 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో మాజీ సైనికులను సన్మానించే కార్యక్రమాన్నికేంద్రం తలపెట్టింది. స్వర్ణిమ్ విజయ్ వర్ష్ పేరుతో గత ఏడాది డిసెంబర్ 16న ప్రధాని నరేంద్ర మోదీ కాగడాను వెలిగించారు.

  • Share this:
    ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం తిరుపతిలో పర్యటించనున్నారు. సాయంత్రం ఆర్మీ అధికారులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. 1971 నాటి భారత్-పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్న ఆర్మీ అధికారి మేజర్ జనరల్ సీ వేణుగోపాల్‌ను సీఎం జగన్ సత్కరించనున్నారు. పోలీస్ గ్రౌండ్స్ జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొని మాజీ సైనికులను ఆయన సన్మానిస్తారు. అనంతరం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. జగన్ పర్యటనను నేపథ్యంలో తిరుపతిలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు.

    గురువారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం జగన్ తిరుపతికి బయలుదేరుతారు. సాయంత్రం 4.30 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. 4.50 నిమిషాలకు తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన మాజీ సైనికుల సన్మాన కార్యక్రమానికి హాజరవుతారు. అనంరతం తిరుపతిలో చేపట్టదలిచిన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. తిరిగి 7.10 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని గన్నవరం బయలుదేరి వెళ్తారు.

    భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన 50 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో మాజీ సైనికులను సన్మానించే కార్యక్రమాన్నికేంద్రం తలపెట్టింది. స్వర్ణిమ్ విజయ్ మాషల్ పేరుతో గత ఏడాది డిసెంబర్ 16న ప్రధాని నరేంద్ర మోదీ కాగడాను వెలిగించారు. ఆ కాగడాను భారత్-పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులు, ఆర్మీ అధికారులు ఉన్న ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. అది దక్షిణాది రాష్ట్రాల్లోకి తొలిసారిగా అడుగుపెడుతోంది. దక్షిణాదిన తిరుపతి నుంచి కాగడా యాత్ర ప్రారంభం అవుతోంది. తిరుపతితో పాటు విశాఖపట్నం, కాకినాడల్లో నివసించే మాజీ సైనికులు సన్యాసి నాయుడు, కేజే క్రిస్టొఫర్ కుటుంబ సభ్యులను కూడా ఆర్మీ అధికారులు సన్మానించనున్నారు. అనంతరం ఈ కాగడా తమిళనాడుకు వెళ్తుంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు