Saaho | ప్రభాస్ విజ్ఞప్తికి ఓకే చెప్పిన జగన్ ప్రభుత్వం

అత్యంత భారీ బడ్జెట్ సినిమా కావడంతో ఓపెనింగ్‌లోనే భారీ వసూళ్లు సంపాదించాలని నిర్మాతలు కూడా ప్లాన్ చేశారు.

news18-telugu
Updated: August 24, 2019, 9:38 PM IST
Saaho | ప్రభాస్ విజ్ఞప్తికి ఓకే చెప్పిన జగన్ ప్రభుత్వం
వైఎస్ జగన్, ప్రభాస్
news18-telugu
Updated: August 24, 2019, 9:38 PM IST
ప్రభాస్ సినిమాకు అనుకూలంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 30న ప్రభాస్ నటించిన సాహో సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఆ సినిమాను సుమారు రూ.350 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారనే ప్రచారం ఉంది. అయితే, అత్యంత భారీ బడ్జెట్ సినిమా కావడంతో ఓపెనింగ్‌లోనే భారీ వసూళ్లు సంపాదించాలని నిర్మాతలు కూడా ప్లాన్ చేశారు. దీంతో సాహో సినిమా రిలీజైన తర్వాత తొలి రెండు వారాల పాటు ధియేటర్లలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి కోరారు. యూవీ క్రియేషన్స్ నుంచి వచ్చిన విజ్ఞప్తికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో ఇకపై సాహో ప్రదర్శించే ధియేటర్లలో టికెట్ రేట్లు పెంచుకోవచ్చు. రూ.100 టికెట్ రూ.200కు పెరగనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో కూడా ఇలా భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. బాహుబలి సినిమాకు చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి అనుమతులు ఇచ్చారు. ఇప్పుడు జగన్ కూడా అదే బాటలోనడిచారు.

తెలంగాణలో కూడా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతివ్వాలంటూ కేసీఆర్ ప్రభుత్వాన్ని యూవీ క్రియేషన్స్ విజ్ఞప్తి చేసింది. కానీ, తెలంగాణ సర్కారునుంచి ఇంకా అనుమతి రాలేదు. సినిమా రిలీజ్‌కు ఇంకా సమయం ఉంది కాబట్టి కేసీఆర్ కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

First published: August 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...