AP Cabinet: నివర్ తుఫాన్ బాధితులకు డబ్బులు.. వారందరికీ ఇవ్వాలన్న సీఎం

సీఎం జగన్(ఫైల్ ఫోటో)

Cyclone Nivar: ఆంధ్రప్రదేశ్‌లో నివర్ తుఫాన్ బాధితులకు ఆర్థికసాయం అందించాలని ఏపీ మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు.

 • Share this:
  AP Cabinet Latest News: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించింది. నివర్ తుఫాన్ బాధితులకు ఆర్థికసాయం అందించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ‘నివర్‌ తుఫాన్‌ (Cyclone Nivar) పై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 289 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు గుర్తించారు. 10 వేల మందికి పైగా సహాయక శిబిరాలకు తరలించారు. శిబిరాల్లో ఉన్న వారికి రూ.500 నగదు ఇవ్వాలని సీఎం జగన్‌ ఆదేశించారు.’ అని మంత్రి కురసాల కన్నబాబు (Kurasala Kannababu) కేబినెట్ సమావేశం అనంతరం వెల్లడించారు. డిసెంబర్ 15 కల్లా పంటనష్టం అంచనాల రూపకల్పన, డిసెంబర్ 30 కల్లా పరిహారం చెల్లిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) ఎత్తుపై కేబినెట్‌లో చర్చ జరిగింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారంటూ ప్రతిపక్ష టీడీపీ చేస్తున్న ఆరోపణలను కేబినెట్ ఖండించింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు సెంటీమీటర్‌ కూడా తగ్గదని సీఎం జగన్‌ తేల్చి చెప్పారు. వాస్తవ డిజైన్‌ల ఆధారంగానే పోలవరం నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేశారు.

  Cyclone Nivar: ఏపీలో ఈ 4 జిల్లాల్లో అతి తీవ్ర భారీ వర్షాలు

  సుప్రీంకోర్టులో జగన్‌కు డబుల్ బొనాంజా.. మరో గుడ్ న్యూస్

  ఉద్యోగులకు డీఏ బకాయిలు చెల్లింపు
  ఉద్యోగులు, పింఛన్‌దారుల డీఏ (DA to AP Govt Employees) బకాయిల్ని చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది. 3.144 శాతం డీఏ పెంపునకు ఆమోదం తెలిపింది. ఈ ఏడాది జనవరి నుంచి వర్తించనుంది. ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిలన్నీ పూర్తిగా చెల్లించాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. కరోనా సమయంలో జీతాలు, పింఛన్లలో విధించిన కోత డిసెంబర్‌, జనవరి నెలలో చెల్లించాలని కూడా కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు.

  వైఎస్ షర్మిలతో వైసీపీ ఎమ్మెల్యే రోజా... ఏం జరుగుతోంది?

  మోదీ, జగన్ ‘ట్రెండ్ సెట్టర్స్’.. సోషల్ మీడియాలో దుమ్మురేపిన లీడర్స్.. ర్యాంక్స్ ఎంతంటే

  డిసెంబర్ 25న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ
  డిసెంబర్‌ 25న 30 లక్షల 60 వేల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ (Free House for Poor Scheme) చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 175 నియోజకవర్గాల్లో డిసెంబర్‌ 25న ఇళ్ల పట్టాల పంపిణీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కోర్టు స్టేలు ఉన్న ప్రాంతాల్లో మినహా మిగిలిన ప్రాంతాల్లో ఇళ్ల పట్టాలు కేటాయిస్తారు. కోర్టు కేసులు ఉన్న ప్రాంతాల్లో ఆ తర్వాత దశలో ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తారు. ఇళ్ల నిర్మాణం చేసుకునే వారికి ఉచితంగా ఇసుక ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

  Tirupati ByPolls: పవన్ కళ్యాణ్‌కు షాక్ ఇస్తున్న బీజేపీ, తిరుపతి బీజేపీ అభ్యర్థి ఖరారు?

  గ్రానైట్‌లా తళతళలాడేవాడు.. ఆమెపై వ్యామోహం.. అతణ్ని చంపేసింది.. ఖమ్మం జిల్లాలో క్రైం కహానీ

  డిసెంబర్‌ 15న రైతులకు రూ.1227 కోట్లతో పంట బీమా (Crop Insurance) పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. దీని వల్ల ఈ-క్రాప్‌ బుకింగ్‌లో రైతులు బీమా చేసుకున్న పంటలకు ఉచితంగానే ఇన్సూరెన్స్‌ ప్రయోజనం కలగనుంది.

  అమరావతిలో జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో వీటితోపాటు పలు అంశాలను కూడా చర్చించినట్టు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిణామాల మీద కూడా చర్చించినట్టు సమాచారం. ఏపీలో కరోనా కేసులు, తీసుకుంటున్న చర్యలు, వ్యాక్సిన్ కోసం ముందస్తు ఏర్పాటు వంటి వాటిపై కూడా చర్చించారు. అలాగే, స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై కూడా చర్చించినట్టు తెలిసింది. జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం కరోనా దృష్ట్యా అది సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: