వైఎస్ జగన్... ఏపీ ముఖ్యమంత్రి... నేమ్‌ ప్లేట్ రెడీ అవుతుంది...

Andhra Pradesh Politics : ఏపీ రాజకీయాల్లో మరోసారి నేమ్ ప్లేట్ వ్యవహారం కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి పీఠాన్ని జగన్ అధిరోహించబోతున్నారంటున్న ప్రచారంతో నేమ్ ప్లేట్ సిద్ధమవుతుందన్న వార్తలు తెరపైకి వస్తున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: May 5, 2019, 7:11 AM IST
వైఎస్ జగన్... ఏపీ ముఖ్యమంత్రి... నేమ్‌ ప్లేట్ రెడీ అవుతుంది...
పృథ్వీరాజ్ (Image Credit : Facebook)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే... వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనే అక్షరాలు బంగారపు పూత పూసినట్లుగా ఉన్న సరికొత్త నేమ్ ప్లేట్ సోషల్ మీడియాలో కలకలం రేపింది. దాన్ని ఎవరు తయారుచేశారన్నది అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. వైసీపీ నేతలకు కంగారెక్కువ... అప్పుడే నేమ్ ప్లేట్ కూడా రెడీ చేసేసుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తే, ఆ నేమ్ ప్లేట్‌ని తయారుచేయించింది టీడీపీ నేతలే అంటూ కౌంటర్లిచ్చారు వైసీపీ నేతలు. మొత్తంగా అసలా నేమ్ ప్లేట్ ఎవరు తయారుచేయించారో ఎవరూ కనుక్కునే ప్రయత్నం చెయ్యలేదు. దాంతో ఓ నాల్రోజులు చర్చ జరిగాక ఆ విషయం కనుమరుగైంది. మళ్లీ తాజాగా అదే అంశం తెరపైకి వచ్చింది. ఇందుకు కారణం టాలీవుడ్ కమెడియన్ స్టార్, వైసీపీ నేత పృథ్వీరాజ్.

ఎవడో వెధవ ఆ నేమ్ ప్లేట్ తయారుచేయించాడంటున్న పృథ్వీరాజ్... దాన్ని వైసీపీ నేతలకు అంటగట్టడమేంటని మండిపడ్డారు. ఛాన్స్ ఇస్తే జగన్మోహన్ రెడ్డికి బదులు డూప్‌ని తయారుచేస్తారని సెటైర్ వేశారు. అలాంటి టెక్నాలజీ కూడా ఉందన్న పృథ్వీరాజ్... నేమ్ ప్లేట్ తయారుచేయించుకోవాల్సిన అవసరం జగన్‌కి లేదన్నారు. జగన్ సీఎం పీఠం ఎక్కిన తర్వాత, నేమ్ ప్లేట్ ఆటోమేటిక్‌గా అధికారులే గౌరవంగా జగన్‌కు తెచ్చి ఇస్తారని అన్నారు. ఆల్రెడీ అందుకు సంబంధించి ఏర్పాట్లు ముందుగానే జరుగుతూ ఉండొచ్చన్నట్లు వ్యాఖ్యానించారు. ఇంత చిన్న లాజిక్‌ కూడా తెలియని టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు విమర్శలు చెయ్యడం తగదన్నారు.

మొత్తానికి సద్దుమణిగిన నేమ్ ప్లేట్ వ్యవహారం పృథ్వీరాజ్ ద్వారా మళ్లీ తెరపైకి వచ్చింది. తమపై వస్తున్న ప్రతీ విమర్శకీ కౌంటర్ ఇస్తున్న టీడీపీ నేతలు... పృథ్వీ సెటైర్లను లైట్ తీసుకుంటారో, ఎవరైనా సరే కౌంటర్ ఇవ్వాల్సిందే అనుకుంటూ రివర్స్ ఎటాక్ చేస్తారో పొలిటికల్ సర్కిలే తేల్చాలి. ఏప్రిల్ 11న ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే... ఫలితాలు మే 23న రిలీజ్ కాబోతున్నాయి. వాటికంటే ముందుగా మే 19న ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. అందుకు ఇంకా మూడు వారాల టైమ్ ఉంది. అప్పటివరకూ ఈ రాజకీయ రచ్చ కొనసాగేలా కనిపిస్తోంది.

 

ఇవి కూడా చదవండి :

నేడు CBSE 10th ఫలితాలు విడుదల... ఎలా చెక్ చేసుకోవాలంటే...

నేడు ఏపీలో గ్రూప్ -2 స్క్రీనింగ్ టెస్ట్... 447 పోస్టులు... ఒక్కో పోస్టుకీ 660 మంది పోటీరేపు ఒడిశాలో పీఎం నరేంద్ర మోదీ పర్యటన... నష్టంపై క్షేత్రస్థాయి పరిశీలన
First published: May 5, 2019, 7:11 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading