Home /News /andhra-pradesh /

YS JAGAN MOHAN REDDY SHOULD KEEP TELANGANA NEW DISTRICTS EXPERIENCE IN MIND BEFORE FORMING NEW DISTRICT IN ANDHRA PRADESH AK

AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల వ్యవహారం.. తేడా వస్తే తెలంగాణ తరహాలో అవుతుందా ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

AP Telangana: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో సీఎం జగన్ ఏ మాత్రం తగ్గినా.. తెలంగాణలో వచ్చిన సమస్యలు ఉత్పన్నమవుతాయనే చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది.

    ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం వైఎస్ జగన్ సర్కార్ వేగంగా పావులు కదుపుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు తోడు మరో 13 జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన వివరాలను కూడా విడుదల చేసింది. వీటిలో చిన్న చిన్న మార్పులు తప్పితే.. పెద్దగా మార్పులు చేసే ఆలోచన జగన్ ప్రభుత్వానికి లేదని వార్తలు వినిపిస్తున్నాయి. స్థానికంగా ప్రజల నుంచి వచ్చే డిమాండ్లను పరిశీలిస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. వాటిని ఎంతవరకు పరిగణనలోకి తీసుకుంటారనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో సీఎం జగన్ ఏ మాత్రం తగ్గినా.. తెలంగాణలో వచ్చిన సమస్యలు ఉత్పన్నమవుతాయనే చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది.

    తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కొంతకాలానికే కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని డిసైడయిన సీఎం కేసీఆర్.. మొదట 24 జిల్లాలను మాత్రమే ఏర్పాటు చేయాలని భావించారు. ఆ దిశగానే బ్లూఫ్రింట్ సిద్ధం చేశారు. అయితే ఆ తరువాత పరిస్థితులు మారిపోయాయి. స్థానికంగా ప్రజల నుంచి కొన్ని డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని భావించిన కేసీఆర్.. అలాంటి అనేక డిమాండ్లకు తలొగ్గాల్సి వచ్చింది. అలా తెలంగాణలో 24 జిల్లాలను చేయాలనుకున్న కేసీఆర్ ప్రభుత్వం.. 31 జిల్లాలను ఏర్పాటు చేసింది.

    2018లో రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. నారాయణపేట, ములుగు ప్రాంతాలను కూడా కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేశారు. దీంతో పది జిల్లాల తెలంగాణ కాస్త 33 జిల్లాలుగా మారిపోయింది. జిల్లాల పేర్ల విషయంలోనూ ఈ రకమైన డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించింది. అయితే ఈ రకమైన డిమాండ్ల విషయంలో కొద్దిగా తలొగ్గినా.. మిగతా చోట్ల కూడా ఉద్యమాలు ఊపందుకుంటాయని తెలంగాణలోని పరిస్థితులు తెలియజేశాయి. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రస్తుతం ప్రకటించిన జిల్లాలు కాకుండా కొత్తగా జిల్లాల కోసం పుట్టుకొచ్చే డిమాండ్లను పరిగణనలోకి తీసుకుంటారా ? లేదా ? అన్నది ఆసక్తికరంగా మారింది.

    AP New Districts: సీమకు సముద్రం.. కొత్త జిల్లాలతో మారిన స్వరూపం.. రాయలసీమలో బంగాళాఖాతం..!

    AP New Districts Issue:ఏపీలోని ఆ జిల్లాపై మళ్లీ అభ్యంతరం.. వివాదానికి కారణం ఇదే..!

    కొత్త జిల్లాలు, ఆ జిల్లాలకు పేర్లు, కొత్త రెవెన్యూ డివిజన్లు.. ఇలాంటి వాటి కోసం పుట్టుకొచ్చే డిమాండ్లను అంగీకరిస్తే.. మిగతా ప్రాంతాల్లోనూ ఇలాంటి డిమాండ్లకు సంబంధించిన ఉద్యమాలు ఉధృతమయ్యే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన పరిణామాలను ఏపీ ప్రభుత్వానికి, అధికారులకు తెలియనవి కావని.. కాబట్టి ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్ జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందనే చర్చ జరుగుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: AP new districts, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు