జగన్ కారుణ్యం.. వైఎస్‌తోపాటు చనిపోయిన ఐఏఎస్.. కుమార్తెకు గ్రూప్ 1 ఉద్యోగం

2009 సెప్టెంబరు 2 తేదీన వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు వెళ్లిన ఆయన కార్యదర్శి సుబ్రమణ్యం ఆ ప్రమాదంలో మరణించారు.

news18-telugu
Updated: July 4, 2019, 8:16 PM IST
జగన్ కారుణ్యం.. వైఎస్‌తోపాటు చనిపోయిన ఐఏఎస్.. కుమార్తెకు గ్రూప్ 1 ఉద్యోగం
వైఎస్ జగన్ (File)
news18-telugu
Updated: July 4, 2019, 8:16 PM IST
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఐఎఎస్ అధికారి సుబ్రహ్మణ్యం కుమార్తె సింధు సుబ్రహ్మణ్యంకు డిప్యూటీ కలెక్టర్ గా గ్రూప్ వన్ సర్వీసు ఉద్యోగం ఇస్తూ ఆంధ్రప్దరేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2009 సెప్టెంబరు 2 తేదీన వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు వెళ్లిన ఆయన కార్యదర్శి సుబ్రమణ్యం ఆ ప్రమాదంలో మరణించారు. అయితే, ఆయన కుమార్తె సింధు సుబ్రమణ్యంకు కారుణ్య నియామకం కింద గ్రూప్ వన్ ఉద్యోగమిస్తూ రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ ఆదేశాలిచ్చారు. ప్రత్యేక కేసు కింద పరిగణిస్తూ సింధు సుబ్రహ్మణ్యంకు ఏపీ సివిల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో డిప్యూటీ కలెక్టర్ గా ఉద్యోగం ఇస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కోన్నారు.

First published: July 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...