తప్పుడు వార్తలపై ఉక్కుపాదం.. సీఎం జగన్ కీలక నిర్ణయం..?

ప్రస్తుతానికి రిజాయిండర్లతో సరిపెట్టి.. ఆ తర్వాత నోటీసులు వరకు వెళ్లే అవకాశముందని సమాచారం. అవసరమైతే పరువు నష్టం దావా కూడా వేసే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: October 16, 2019, 10:51 PM IST
తప్పుడు వార్తలపై ఉక్కుపాదం.. సీఎం జగన్ కీలక నిర్ణయం..?
సీఎం వైఎస్ జగన్ (File Photos)
news18-telugu
Updated: October 16, 2019, 10:51 PM IST
తప్పుడు వార్తలపై ఉక్కుపాదం మోపాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ యోచిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులు, కాంట్రాక్టులకు సంబంధించి తప్పుడు వార్తా కథనాలు రాసే మీడియా హౌస్‌లపై ఇకపై చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఆయా శాఖలపై వచ్చే కథనాలపై కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని.. తప్పుడు వార్తలు వస్తే వెంటనే ఖండించి వెంటనే రీజాయిండర్ (ప్రత్యుత్తరం) జారీ చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో తప్పుడు కథనాలపై చర్చ జరిగినట్లు సమాచారం.

ప్రస్తుతంం పలు మీడియా సంస్థలు పనిగట్టుకొని మరీ ఏపీ ప్రభుత్వంపై తప్పుడు కథనాలను ప్రసారం, ప్రచురణ చేస్తున్నారని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉద్దేశపూర్వక కథనాలను రూపొందిస్తున్నారని జగన్ దృష్టికి వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే తప్పుడు వార్తలను కట్టడి చేయాలని..ఆయా సంస్థలపై చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ యోచిస్తున్నారు. ప్రస్తుతానికి రిజాయిండర్లతో సరిపెట్టి.. ఆ తర్వాత నోటీసులు వరకు వెళ్లే అవకాశముందని సమాచారం. అవసరమైతే పరువు నష్టం దావా కూడా వేసే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

First published: October 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...